twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bad Boy Billionaires released in Netflix: ‘సత్యం’ రామలింగరాజుకు ఊరట.. మాల్యాకు షాక్

    |

    వివాదాలు, ఆరోపణలు, కోర్టు కేసుల మధ్య మోస్ట్ కాంట్రవర్సియల్ వెబ్ సిరీస్ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా అనే సిరీస్‌ను తన ఓటీటీ ప్లాట్‌ఫాంపై నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. భారతీయ పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని దారుణంగా అప్రతిష్టపాలైన కొందరు పారిశ్రామిక వేత్తల జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయవద్దని కోర్టులో దావా వేసిన సమయంలో ఈ సిరీస్ రిలీజ్ కావడం సంచలనంగా మారింది.

    పారిశ్రామిక దిగ్గజాల జీవితాలు ఆధారంగా

    పారిశ్రామిక దిగ్గజాల జీవితాలు ఆధారంగా

    బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా అనే వెబ్ సిరీస్‌ను సుబ్రతా రాయ్, బీ రామలింగ రాజు, మేహల్ చోక్సి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా జీవితాల ఆధారంగా రూపొందించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ కాకుండా నిలిపివేయాలని సుబ్రతా రాయ్, బీ రామలింగ రాజు, మేహల్ చోక్సి కోర్టును ఆశ్రయించడంతో వివాదస్పదంగా మారింది.

    కుంభకోణాలను, అవినీతిని పరిశోధించి డాక్యుమెంటరీగా

    కుంభకోణాలను, అవినీతిని పరిశోధించి డాక్యుమెంటరీగా


    ఇటీవల కాలంలో అప్రతిష్టపాలైన కొందరు పారిశ్రామిక వేత్తల జీవితాల ఆధారంగా రూపొందిన బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. వారి జీవితంలోని బాధలు, కుంభకోణాలు, అవినీతిని పరిశోధించి డ్యాక్యుమెంటరీని రూపొందించాం అని నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

    రామలింగ రాజు ఎపిసోడ్స్‌ను మినహాయించి

    రామలింగ రాజు ఎపిసోడ్స్‌ను మినహాయించి


    తన జీవితం ఆధారంగా రూపొందించిన బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా రిలీజ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో నిలిపివేయాలని సత్యం కంపెనీ మాజీ అధినేత బీ రామలింగ రాజు హైదరాబాద్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించడంతో ఈ వెబ్ సిరీస్‌లోని మూడు ఎపిసోడ్‌ లేకుండా విడుదల చేయడం గమనార్హం.

    సహారా గ్రూప్ ఆగ్రహం

    సహారా గ్రూప్ ఆగ్రహం


    అయితే బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియాలో మూడు ఎపిసోడ్స్ లేకుండా విడుదల చేయడం కుట్ర పూరితమైందని సహారా గ్రూప్ వ్యాఖ్యానించింది. జర్నలిజం స్వేచ్ఛ పేరుతో కొందరి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌పై, వారి ప్రమోటర్స్, నిర్మాతలు, డైరెక్టర్లు, రిపోర్టలపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.

    విజయ్ మాల్యాను బలి పశువుగా చేశారని

    విజయ్ మాల్యాను బలి పశువుగా చేశారని

    బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా వెబ్ సిరీస్ రిలీజ్ నేపథ్యంలో విజయ్ మాల్య కుమారుడు సిద్ధార్థ్ మాల్య స్పందించారు. తన తండ్రిని ప్రభుత్వం బలి పశువుగా చేసింది అని అన్నారు. తన తండ్రిపై 9 వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పటి నుంచి సిద్ధార్థ్ మాల్య నోరు విప్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    English summary
    Most contraversial web series in recent times, Bad Boy Billionaires: India released in Netflix. But former CEO of Satyam Rama linga Raju story exempted from the streaming due to case filed in Hyderabad civil court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X