twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవి రూమర్స్ ...మా సినిమా ఎవరి జీవిత చరిత్ర కాదు

    By Srikanya
    |

    ముంబై: గతంలో పలు కేసుల్లో నేరస్థుడిగా పేరున్న చార్లెస్ శోభరాజ్ పాత్ర మళ్లీ బాలీవుడ్ తెరపై దర్శనమివ్వనున్నాయి. అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభారాజ్ జీవితచరిత్ర, ఆనా టి పరిస్థితులను ఆధారంగా చేసుకుని 'బ్యాడ్' సినిమా రూపొందిందంటూ వచ్చిన పుకార్లను దర్శకుడు ప్రవాల్ రామన్ కొట్టిపారేశాడు. 1986లో చార్లెస్ శోభారాజ్ తీహార్ కారాగారం నుంచి తప్పించుకున్న ఘటనను నేపథ్యంగా తీసుకొని రూపొందించిందంటూ రూమర్స్ రావడంతో ఆయన పైవిధంగా స్పందించాడు.

    ' మా సినిమా ఎవరి జీవిత చరిత్ర కాదు. ఇదొక కాల్పనిక కథాచిత్రం. చార్లెస్ శోభారాజ్‌పై తీసింది కానేకాదు. అమోద్ కాంత్ అనే ఓ పోలీసు అధికారి జైల్ బ్రేక్ కేసును ఏవిధంగా చేధించాడనేదే ఈ సినిమా కథ. చార్లెస్ శోభారాజ్ జీవితానికి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు' అని ప్రవల్ అన్నాడు.

    'Bad' is not based on the life of Charles Sobhraj: Director

    అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన తీహార్ కారాగారంనుంచి 1986లో చార్లెస్ శోభారాజ్ తప్పించుకోవడం తెలిసిందే. బ్యాడ్ సినిమా ఇతివృత్తానికికూడా దాదాపు అదే పోలిక ఉంది. ఈ కేసుపై ఢిల్లీకి చెందిన అప్పటి పోలీసు అధికారి అమోద్ కాంత్ విచారణ జరిపారు. 'చెడుకు మంచికి మధ్య ఉన్న వ్యత్యాసం చూపడమే ఈ సినిమా ఉద్దేశమని ప్రవల్ వివరించా డు.

    ఉదయ్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనేక ఇబ్బం దులను ఎదుర్కొన్నామన్నాడు. అదొక దిగ్భ్రాంతికరమైన ఘటన అన్నాడు. ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ ఈ సినిమా నిర్మాత, యూనిట్ సభ్యులను కొంతమంది దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో నిర్మాత పూజాభట్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించారని చెప్పాడు.

    ఆదిల్ హుస్సేన్ అమోద్ కాంత్‌గాను, రణ్‌దీప్ హుండా నేరగాడి పాత్రలోనూ ప్రేక్షకులకు కనిపించనున్నారు. రణ్‌దీప్ ప్రియురాలిగా రీచా చద్దా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఢిల్లీ, ముంబై, గోవా, మనాలి, థాయ్‌లాండ్‌లలో కూడా జరగనుందని, ఇప్పటికే సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందన్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని యోచిస్తున్నట్టు చెప్పాడు.

    శోభరాజ్ జీవితంలో తనకు గొప్పగా నచ్చే అంశాలు కనిపించలేదని.. అయితే శోభరాజ్ 40 ఏళ్ల జైలు జీవితంపై అంతగా ఆసక్తి లేదని..అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న తీహార్ జైలు నుంచి చార్లెస్ శోభరాజ్ తప్పించకోవడమే తనకు అత్యంత ఆసక్తికరమైన విషయమని దర్శకుడు రామన్ తెలిపారు. జైలు నుంచి తప్పించుకు పోయే అంశమే తన చిత్ర కథ అని దర్శకుడు వెల్లడించారు.

    ఈ చిత్రంలో శోభరాజ్ ను హీరోగా పరిగణించడం లేదని.. జైలు నుంచి పారిపోయిన చార్లెస్ ను పట్టుకున్న సీనియర్ పోలీస్ అధికారులు అమోద్ కాంత్, మధుకర్ జెండేలే ఈ కథలో అసలైన హీరోలు అని తెలిపారు. శోభరాజ్ పాత్రను పకడ్బందీగా తెరకెక్కించేందుకు అవసరమైన పరిశోధన చేస్తున్నామన్నారు.

    ఇక బ్యాడ్ చిత్రం కథ అలావుంటే.. 'సీరియల్ కిల్లర్', 'ది బికినీ కిల్లర్', 'ది సర్పెంట్'గా పరిచయం ఉన్న చార్లెస్ శోభరాజ్ కథను తెరకెక్కించేందుకు ఫరుఖ్ దోండీ రచించిన 'బికినీ మర్డర్స్' పుస్తకం ఆధారంగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి. డీఏఆర్ మోషన్ పిక్చర్స్ బాలీవుడ్ లో ఈ చిత్రం రూపొందనుంది. బికినీ మర్ఢర్స్ చిత్రంపై రచయిత ఫరుఖ్ దోండిని సంప్రదించగా..అనురాగ్ కశ్యప్ తనను సంప్రదించినట్టు వచ్చిన వార్తలు వాస్తవమేనని ధృవీకరించారు.

    English summary
    Director Prawaal Raman has dismissed rumours that his film 'Bad', produced by Pooja Bhatt, is based on the life and times of notorious criminal Charles Sobhraj. The film is said to be based on the 'Bikini Killer' Charles Sobhraj's sensational jailbreak from the Tihar prison in 1986. "Our film is not a biopic, it is a fictional story. It is not on Charles Sobhraj, it is the story of a police officer named Amod Kanth and how he dealt with a jail break case. The film has nothing to do with Charles Sobhraj," director Prawaal Raman told PTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X