ప్రభాస్ యూఎస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యూఎస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. తాజాగా అందిన సమాచారం ప్రకారం యూఎస్‌లో ప్రీమియర్ షో నిర్వహించడం లేదని తెలుస్తోంది. ప్రింట్లు లేట్ కావడం వల్లనే ప్రీమియర్ షో వేయడం సాధ్యం కావడం లేదనే ప్రచారం జరుగుతోంది.
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో 'రెబల్' మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. టిక్కెట్ల కోసం థియేటర్ల వద్ద ఫ్యాన్స్ భారులు తీరారు. కొన్ని చోట్ల వారం రోజుల టికెట్స్ ఇప్పటికే బుక్ అయి పోయాయి. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాతో పాటు ఆంధ్రా, సీడెడ్, ఇతర టెర్రిటరీల్లో భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించి విడుదల చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. ప్రభాస్ యాక్షన్, తమన్నా, దీక్షా సేథ్ గ్లామర్ అభిమానులను మజా చేయనున్నాయి. హైటెక్నికల్ విలువలతో స్టయిలిష్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరుపనున్నారు.
ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











