twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాడ్ ప్లానింగ్ చేసి మా మీద పడి ఏడ్వద్దు: రామ్ చరణ్

    By Srikanya
    |

    అదంతా సరైన ప్లానింగ్ లేకపోవటం వల్ల, అనవసరమైన ఖర్చులు పెంచుకుంటూ పోవటం వల్ల జరుగుతున్న పరిణామం. ఆ తర్వాత స్టార్స్ రెమ్యునేషన్ వల్లే ఇదంతా జరిగిందంటారు. రోజకు ఇలా అనవరసంగా పెట్టే ఖర్చు వల్ల ఇరవై నుంచి పాతిక లక్షలు వరకూ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అలాగే డిలే అవటం వల్ల కూడా బడ్జెట్ లు పెరిగిపోతాయి. మాకు మొదట కమిటైందే ఇచ్చి.. ఎన్ని రోజులు పెరిగినా పని చేయించుకుంటారు అంటున్నారు రామ్ చరణ్. బడ్జట్ పెరుగుదలకు హీరోల రెమ్యునేషన్ కూడా ఒక కారమేకదా అని మీడియా వారు అడిగిన దానికి ఇలా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దాదాపు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.

    రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది. అలాగే అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనువరాలు కామినేని ఉపాసనిని వివాహ విషయమై తరుచుగా వార్తల్లో ఉంటున్నారు.

    English summary
    “It’s bad planning and unnecessary wastage that increases production cost which is often between Rs 20 lakh and Rs 25 lakh per day and not the stars remunerations. Budgets escalate due to delays but our pay packets remain the same even when we end up spending more days on the same film,” defends Ram Charan Teja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X