బ్యాడ్ సెంటిమెంట్‌పై ‘పంజా’ అభిమానుల భయం
సినిమా రంగంలో కొన్ని కొన్ని విచిత్రమైన, ఆశ్చర్య కరమైన సెంటిమెంట్లు ఉంటాయి. ఉదాహరణకు పేరు మార్చకుంటే లక్కు కలిసొస్తుందని...సదరు సినిమా పలాన అక్షరంతో మొదలయితేనే ఆ హీరో సినిమా విజయం సాధిస్తుందని...ఇలా రకరకాల సెంటిమెంటును ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా పవన్ అభిమానులను కూడా ఓ సెంటిమెంటు వేధిస్తోంది. ఆ సెంటిమెంటు మరేమిటో కాదు హైదరాబాద్ కూకట్ పల్లిలోని శివపార్వతి థియేటర్. వినడానికి సిల్లీగా ఉన్న ఇది నిజమండీ బాబు. గత దశాబ్ధ కాలంగా ఈ థియేటర్లో విడుదలైన సినిమాలేవీ విజయవంతం అయిన దాఖలాలు లేవని, మధ్యలో ఓ సారి దేశ ముదురు సినిమా మాత్రం ప్లాపు సెంటిమెంటును అధిగిమించిదని అంటున్నారు. తాజాగా పంజా సినిమా కూడా అదే థియేటర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తుండటంతో అభిమానుల్లో కలవరం నెలకొంది. మరి పవన్ ఈ సెంటిమెంటను అధిగమిస్తాడో...? ఆ థియేటర్ పై ఉన్న మచ్చను తొలగిస్తాడో? లేదో చూడాలి.
ఇక పోతే..పవన్ కళ్యాణ్ పంజా సినిమా డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సారా జేన్ డియాస్, అంజని లవానియాలు నటించారు. నిర్మాతలు : నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, సంగీతం : యవన్ శంకర్ రాజా


Click it and Unblock the Notifications











