twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంత బూతు పోస్టరా అని తిడుతున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ రోజుల్లో చిత్రం వచ్చిన తర్వాత మారుతి పుణ్యమా అని...చిన్న చిత్రాలు బూతు చిత్రాలుగా మారి మార్కెట్ లోకి దూకుతున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు బూతే సేఫ్ అన్న ఫీలింగ్ కి దర్శక,నిర్మాతలు వచ్చేసారు. ఆ విషయాన్నే ప్రమోట్ చేస్తూ పోస్టర్స్, ట్రైలర్స్ కట్ చేస్తున్నారు. కొందరు మరీ శృతి మించి పోస్టర్స్ లోనే తమ పైత్యం చూపెడుతున్నారు. తాజాగా 'అమ్మ నాన్న ఊరిళితే...' ఆడియో విడుదల పోస్టర్ చూసిన వారు ఈ వల్గారిటి ఏమిటని తిట్టి పోస్తున్నారు.

    సిద్ధార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత, మనస్విని, తనూష ముఖ్య పాత్రధారులుగా సుజాత ఆర్ట్స్ పతాకంపై అంజి శ్రీను దర్శకత్వంలో నిర్మాత జక్కుల నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం 'అమ్మ నాన్న ఊరిళితే...' ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది.

    Amma Naana Ooru Velithe

    దర్శకుడు అంజి శ్రీను మాట్లాడుతూ- ''యువత చుట్టూ తిరిగే కథ ఇది. నేటి యువతరం ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత భవితపై ఎక్కుపెట్టిన అస్త్రంలా ఈ చిత్రం ఉంటుంది. జీవితాన్ని ఆస్వాదించే ప్రయాణంలో యువత పెడదారి పడుతోంది. ఈ పరిస్థితుల్లో వారికి కనువిప్పు కలిగించే చిత్రం అవుతుంది ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఇటీవల సోనియా అగర్వాల్‌పై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించాం. ఈ ఐటమ్‌సాంగ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలోనే పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం''అని చెప్పారు.

    నిర్మాత మాట్లాడుతూ -''నేడు యువత నాశనం అవ్వడానికి ఎన్నో కారణాలున్నాయి. అవన్నీ ఒకే సినిమాలో చూపించలేం. అందుకే యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ముఖ్యమైన అంశాల నేపథ్యంలో అంజి శ్రీను ఈ చిత్రం చేస్తున్నారు. సోనియా అగర్వాల్ చేసిన '7/జి బృందావన కాలనీ'ని చూసి ఆమె అభిమాని అయ్యాను. ఈ సినిమాలో సోనియా ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు. ఈ పాట చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని, వచ్చే నెల పాటలను విడుదల చేయనున్నామని సహనిర్మాతల్లో ఒకరైన సలామ్ చెప్పారు

    ఇతర పాత్రల్లో శివకృష్ణ, అపూర్వ, ఎఫ్.ఎమ్ బాబాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కె.వి.రాజు, పాటలు: పోతుల కిరణ్, శ్రీరాం, తపస్వీ, డాన్స్: సుచిత్రా చంద్రబోస్, అమ్మ రాజశేఖర్, వేణుపాల్, కిశోర్, సంగీతం: మున్నాకాశి, ఎడిటింగ్: బుల్‌రెడ్డి, కెమెరా: ఖాదర్, సహ నిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను.

    English summary
    Sonia Agarwal doing a item Song for a telugu Film titled Amma Naana Ooru Velithe. Film is directed by Anji Srinu.This film posters are filled with vulgarity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X