దిల్ రాజుకి సీన్ లేదా?
ఇంతకుముందు మా సినిమా దిల్ రాజుకు చూపించాం..ఆయనకు బాగా నచ్చింది అనో దిల్ రాజు గారు నైజాం తీసుకుంటానన్నారు..అనో వారానికికొకసారైనా వినపడేది. దిల్ రాజు పేరుని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు కూడా తమ సినిమాలు మార్కెటింగ్ చేసుకోవాలని చూసేవారు. అలాగే దిల్ రాజు కూడా స్క్రీన్ ప్లే, కథ గురించి ఎవరన్నా వెళ్ళి కలిస్తే సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడా సీన్ కనపడటం లేదు. ఇన్నాళ్ళూ దిల్ రాజు ది గోల్డెన్ హ్యాండ్ అన్నవాళ్ళే విమర్సిస్తున్నారు. వరసగా ఎవరైనా ఎపుడైనా, మల్లన్న డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన జోష్ భాక్సా ఫీస్ వద్ద బోల్తాపడటం అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అలాగే ఎంతో ఇష్టపడి చేసిన ఆకాశమంత కూడా పబ్లిసిటీమీద బలవంతంగా ఆడించాల్సిరావటం జరిగింది. కొత్తబంగారు లోకం యాభై రోజుల తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మరో ప్రక్క రాబోయే చిత్రాలు ఎక్కువ భాగం క్రేజి కాంబినేషన్ ఫిల్మ్ లు కావటంతో ఇక బొమ్మరిల్లు లాంటి చిత్రం రావటం కష్టమేనంటున్నారు. ఏదైమైనా దిల్ రాజు వంటి అభిరుచి ఉన్న నిర్మాత సినిమాలు హిట్టయితే మరో నాలుగు సినిమాలు వస్తాయన్నది నిజం.


Click it and Unblock the Notifications











