For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జ్వాలా గుత్తా’ చాలా హాట్ గురూ..!(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : బాడ్మింటన్ కోర్టులో చురుకుగా కదులుతూ తన ఆట తీరుతో పాటు...తన అందంతో, సెక్సీ ఆటిట్యూడ్ తో అభిమానుల మతి పోగొట్టే బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఈ మధ్య కొంత కాలంగా పలు సినిమా ఫంక్షన్లలో హాట్ అండ్ సెక్సీ లుక్ తో దర్శనం ఇస్తూ అందరి చూపులు తనపై పడేలా....ముఖ్యంగా మీడియా అటెన్షన్ మొత్తం తనపైనే ఉండేలా వ్యవహరిస్తోంది.

  దీంతో ఆమె సినిమాల్లోకి వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ మధ్య ప్రభాస్ సినిమాలోనే జ్వాలా గుత్తా సినీరంగ ప్రవేశం ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ అందంతా అవాస్తవం తేలింది. తాజాగా ఆమె నితిన్ హీరోగా రూపొందుతున్న 'గుండె జారి గల్లంతయ్యిందే' అనే చిత్రం ద్వారా ఐటం సాంగు ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

  తన సినిమా రంగ ప్రవేశం గురించి జ్వాలా స్పందిస్తూ...హీరో నితిన్, నిర్మాత నిఖితా రెడ్డి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని, తమ సినిమాలో ఓ పాట చేయాలని అడిగారన్నారు. అయితే వారు తనతో జోక్ చేస్తున్నారని తొలుత అనుకున్నానని, ఆ తర్వాత పాట విని ఒప్పుకున్నానని చెప్పారు.

  గుత్తా జ్వాలా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె తండ్రి క్రాంతి గుత్తా భారతీయుడు కాగా, తల్లి యేలన్ చైనా దేశస్తురాలు.

  మహిళల డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారణిగా ఆమె పలువురు ఆటగాళ్లతో జతకట్టి 13 సార్లు నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచింది.

  మిక్స్‌డ్ డబుల్స్ లోనూ జ్వాలా గుత్తా తన సత్తా చాటింది. పలు ఇంటర్నేషనల్ టైటిల్స్ సొంతం చేసుకుంది.

  తన తోటి క్రీడాకారుడు చేతన్ ఆనంద్(అర్జున అవార్డ్ గ్రహీత)ను ప్రేమించి 2005 జులై 17న పెళ్లి చేసుకున్న జ్వాలా ఆ తర్వాత అతనితో మనస్పర్థల కారణంగా 2011 జూన్ 29న విడాకులు తీసుకుంది.

  తాజాగా ఆమె జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. జ్వాలా సినీ రంగ ప్రవేశం చేస్తోంది.

  నితిన్ హీరోగా రూపొందుతున్న ‘గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తోంది.

  ఈచిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఇది ఐటం సాంగ్ తరహాలో ఉంటుందని టాక్.

  బ్యాడ్మింటన్ కోర్టులో తన అందచందాలతో చూపరుల మతిపోగొట్టే గుత్తా జ్వాలా...సినిమాల్లో రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  ఈ చిత్ర హీరో నితిన్, నిర్మాత నిఖితా రెడ్డి తనకు స్నేహితులు కావడం వల్లనే నటించడానికి ఒప్పున్నానని అంటోంది జ్వాలా...

  మరి జ్వాలా గుత్తా సినీ కెరీర్ సక్సెస్ కావాలని బెస్టాఫ్ లక్ చెబుదాం. '

  తొలి రోజు షూటింగ్‌లో కొద్దిగా భయమేసిందని, సెట్‌లో చాలామంది ఉన్నారని చెప్పారు. అంతమంది మధ్య డాన్స్ చేయడం తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఈ నృత్యాల కోసం వారం రోజుల పాటు రిహార్సల్స్ చేశానని చెప్పారు. ఏదేమైనా ఇది చాలా సరదాగా ఉందని జ్వాలా చెప్పారు. సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన తొలి ప్రాధాన్యం బ్యాడ్మింటన్‌కేనని జ్వాల స్పష్టం చేశారు.

  English summary
  
 Badminton player Jwala Gutta, who has won the National Badminton Championships 13 times, is all set to enter films. Yes! The left-handed Indian player herself has confirmed the news on her official Twitter page. The Hyderabadi girl will perform a special song in her friend, actor Nithin's upcoming Telugu movie Gunde Jaari Gallanthayyinde (GJG), which features Nithya Menon in the female lead. Gunde Jaari Gallanthayyinde is an upcoming romantic thriller, which features Nithin and Nithya Menon in the leads roles. The movie is directed by Vijay Kumar Konda and produced by N Sudhakar Reddy. Music director Anoop Rubens is composing tunes for this film which is scheduled to release worldwide on March 4, 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X