For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్‌హాట్‌గా పవన్ హీరోయిన్ సెల్ఫీ.. ముసలి.. వయసు అయిపోయింది అని కామెంట్లు

By Rajababu
|

బద్రీ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించిన అమీషా పటేల్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ నుంచి దాదాపు కనుమరుగైపోయింది. అప్పట్లో హిందీలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు సంచలన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్‌లో ఆమె కెరీర్ గాడిన పడినట్టే అనే భావన కలిగింది. కానీ అమీషా కెరీర్‌‌కు అర్ధాంతరంగా తెరపడింది. ఇలా కనుమరుగైన అమీషా పటేల్ తాజాగా హాట్ హాట్‌గా సెల్ఫీతో ఫోజిచ్చింది ఇబ్బందులో పడింది. సోషల్ మీడియాలో అమీషా సెల్ఫీ చూసిన నెటిజన్లు ఆమె దుమ్ము దులిపేశారు.. ఇంతకీ ఏమిజరగిందంటే..

బద్రీతో మంచి మార్కులు

బద్రీ చిత్రంతో అమీషా పటేల్ అటు గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో మంచి భవిష్యత్ ఉందని అందరూ అనుకుంటుండగానే కహో నా ప్యార్ హై చిత్రం బ్లాక్ బస్టర్‌గా కావడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు పరుగుపెట్టింది. ఆ తర్వాత గదర్ ఏక్ ప్రేమ్ కహానీ సంచలన విజయం సాధించింది.

వరుసగా ఫ్లాపులు

అయితే గదర్ చిత్రం తర్వాత ఆమె నటించిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాంయి. దాంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. అందం, అభినయం పుష్కలంగా ఉన్న అమీషా కెరీర్ గాడిన పడకపోవడంపై బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.

నిర్మాతగా అమీషా పటేల్

సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో స్వయంగా అమీషా నిర్మాతగా మారింది. దేశీ మ్యాజిక్ అనే చిత్రాన్ని నిర్మించింది. అయితే ఆమెను దురదృష్టం వెంటాడటంతో ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. దాంతో ఆర్థికంగా కూడా కష్టాల్లో పడింది.

హాట్‌హాట్‌గా ఇన్స్‌టాగ్రామ్‌లో సెల్ఫీలు

ఇవన్నీ నాణేనికి ఒకవైపు అయితే.. తాజాగా హాట్ హాట్‌గా సెల్ఫీలు దిగి సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోను చూసిన అభిమానులు, నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. నీ సెల్ఫీ చూస్తే నీకు వయసు అయిపోయింది అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు.

ముసలిదానివి అయిపోయావు

ఇంకా ‘నీకు ఇలాంటి వేషాలు సరిపడవు', అయ్యో ముసలిదానివి అయిపోయావు. ఇలా ఉన్నా నీకు సినిమా అవకాశాలు వస్తున్నాయా? వయసుకు తగిన అందం ఉంది కానీ.. అవకాశాలు లేకపోవడంతో ఆమెలో ఆందోళన కనబడుతున్నది. అందుకు సాక్ష్యమే ఆమె దిగిన సెల్ఫీ అని పలువురు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు.

English summary
Ameesha Patel has been missing from the Bollywood and Tollywood scene for a long while. She kickstarted her career with a bang, with back-to-back hits like Badri, Kaho Naa Pyaar Hai and Gadar - Ek Prem Katha. In the years that followed, she hit rock-bottom with a spate of flops, and although we have not seen her on the big screen in years, she continues to remain quite active on social media. On Monday, Ameesha took to Instagram to post two selfies, which immediately caught the attention of trolls.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more