Ameesha Patel కోర్టులో లొంగిపోయిన అమీషా పటేల్.. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో బద్రి హీరోయిన్
బాలీవుడ్ నటి అమీషా పటేల్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆమెను పలు కేసులు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా చెక్ బౌన్స్ కేసు కోర్టులో విచారణ జరుగుతున్నది. అయితే కోర్గు ఆదేశాల మేరకు అమీషా పటేల్ రాంచీ కోర్టులో లొంగిపోయారు. దాంతో ఈ వ్యవహారం మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసు వివరాల్లోకి వెళితే..
అమీషా పటేల్ 2018లో హర్ము గ్రౌండ్‌లో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అజయ్ కుమార్ సింగ్ అనే వ్యాపారవేత్తను కలుసుకొన్నారు. అయితే సందర్భంగా లవ్లీ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సినిమాను నిర్మించేందుకు ఫైనాన్స్ చేసేందుకు ముందుకొచ్చారు. దాంతో అమీషా పటేల్, అజయ్ కుమార్‌కు మధ్య ఒప్పందం జరిగింది.

అయితే అమీషా నిర్మాతగా ఓ సినిమా ప్రారంభమైంది. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో తాను ఫైనాన్స్ చేసిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగారు. అయితే కొంత డబ్బును తిరిగి ఇచ్చింది. మిగితా 2.5 కోట్ల కోసం చెక్ ఇచ్చింది. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో అమీషా పటేల్‌పై కేసు నమోదైంది.
రాంచీ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అమీషా పటేల్ గైర్హాజరైంది. దాంతో కోర్టు ఆమె వారెంట్ జారీ చేసింది. దాంతో రాంచీకి వచ్చి కోర్టులో లొంగిపోయారు. అయితే చెక్ బౌన్స్ కేసులో ఆమెకు కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. జూన్ 21న మళ్లీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

అమీషా పటేల్ కెరీర్ విషయానికి వస్తే.. మరోసారి గదర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్‌తో కలిసి నటిస్తున్నారు. తన కొడుకుతో తారా సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లే కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











