బెంగళూరులో ‘బద్రినాథ్’ అర్థశతదినోత్సవ వేడుక...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమన్నా జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బద్రినాథ్ చిత్రం 50రోజుల విజయోత్సవ వేడుకలను ఈ నెల 23న (శనివారం)సాయంత్రం బెంగళూరు లోని స్థానిక బీడిఏ కాంప్లెక్స్ ఎదుట ఉన్న సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్, దర్శకుడు వివి వినాయక్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ, జైళ్ల శాఖ మంత్రి ఏ నారాయణస్వామి, తదితరులు ముఖ్య అథితులుగా పాల్గొంటున్నట్టు సమాచారం.
బెంగుళూరులోని ఆరు థియేటర్స్ లో, చింతామని చిక్కబళ్లాపుర, గౌరిబిదనూరు, ముళబాగిలు, కోలారులోని థియేటర్ లలోనూ బద్రినాథ్ విజయమంతంగా ప్రదర్శింపబడుతోందన్నారు. కర్ణాటకలోని 11 థియేటర్స్ లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా అభిమానుల కోరిక మేరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ..


Click it and Unblock the Notifications











