twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ 'బద్రీనాధ్'చిత్రం ఆడియో లాంచింగ్ డేట్..డిటేల్స్

    By Srikanya
    |

    అల్లు అర్జున్, తమన్నా కాంబినేషన్ లో వివి వినాయిక్ రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ బద్రీనాధ్. ఈ చిత్రం ఆడియో మే ఎనిమిదవ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సమురాయ్ గా ఓ కొత్త తరహా గెటప్ లో విచిత్రమైన పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా అతనితో ప్రేమ లో పడి సొంతం చేసుకునే పాత్రలో చేస్తోంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథని చిన్ని కృష్ణ అందించారు. తమన్నాకీ అల్లు అర్జున్ కీ వచ్చే ప్రేమ సన్నివేసాలు హైలెట్ గా కనిపించనున్నాయి. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: చిన్నికృష్ణ, కళ: ఆనంద్‌ సాయి, ఛాయాగ్రహణం: ఎస్‌.రవివర్మన్‌, కూర్పు: గౌతంరాజు, నిర్మాణ సారథ్యం: ఠాగూర్‌ మధు.

    English summary
    Allu Arjun, Tamanna starrer Badrinath is among the most awaited films of the year. Directed by VV Vinayak, the film is being produced by Allu Aravind on a grand scale. Audio of the film would be launched on May 8. MM Keeravani has composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X