బన్నీలోని కొత్త కోణాన్ని చూస్తాము: రామ్ చరణ్ ( 'బద్రినాథ్' ఆడియో విశేషాలు)
బద్రినాథ్‌తో బన్నీలోని కొత్త కోణాన్ని చూస్తామన్నారు రామ్ చరణ్ .. శనివారం రాత్రి నిర్వహించిన 'బద్రినాథ్' చిత్ర ఆడియో వేడుకలో గెస్ట్ గా రామ్ చరణ్ పాల్గొన్నారు. అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించిన చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. కీరవాణి సంగీతం సమకూర్చారు. తొలి సీడీని చిరంజీవి, రాఘవేంద్రరావు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఎస్.ఎస్.రాజమౌళి, వినాయక్ స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రసంగించారు. తదుపరి సంగత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ...''ఈ సినిమాలో మొదటి పాటగా నా గురువు వేటూరి సుందరరామమూర్తి గారు రాసింది పెట్టాం. చిత్ర విజయానికి అదే తొలి మెట్టు'' అన్నారు .
అనంతరం దర్శకుడు వినాయక్ ''ఏడు సంవత్సరాలపాటు చిన్నికృష్ణ ఈ కథను తన దగ్గరపెట్టుకొన్నారు. ఆ తరవాత కథపై పూర్తి అవగాహన పెంచుకొనేందుకు నాకు రెండు నెలలుపట్టింది. కీరవాణితో ఇన్నాళ్లూ నేను పని చేయకపోవడానికి కారణం ఏమిటంటే- ఆయన ఏదైనా ట్యూన్ ఇస్తే నచ్చలేదని చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమా చేశాక ఎందుకు ఇంత మంచి స్నేహితుడితో ఇన్నాళ్లూ చేయలేదా అనిపించింద''న్నారు.
తదుపరి అల్లు అర్జున్ చిత్రం గురించి చెబుతూ....ఇది నా పదో సినిమా. నా తొలి చిత్రానికి కథను ఇచ్చింది చిన్నికృష్ణ. స్వరాలు అందించింది కీరవాణి. మళ్లీ పదో చిత్రానికి వారిద్దరూ పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ...''మగధీర, బద్రినాథ్ చిత్రాలను చూస్తుంటే నేను ఏదైనా దూరం చేసుకొంటున్నానా అనిపిస్తుంటుంద''న్నారు చిరంజీవి. ''మమ్మల్ని ముందుకు నడిపించే శక్తి అభిమానులే. నా తరవాతి తరాన్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. మంచి చిత్రం చేసేందుకు బన్నీ కష్టపడతాడు. వినాయక్ ఈ సినిమాను ఎంతో క్రమశిక్షణతో తెరకెక్కించారు. రచయిత చిన్నికృష్ణ కథ చెబుతుంటే తొలి కాపీ చూసినట్లు అనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, సుకుమార్, చంద్రబోస్, చైతన్యప్రసాద్, ఠాగూర్ మధు తదితరులు


Click it and Unblock the Notifications











