twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీరకి-బద్రినాథ్ కి పోలికేంటి..కావాలంటే ఇంద్రతో పోల్చుకోండి...

    By Sindhu
    |

    మొదట్నుంచీ బద్రినాథ్ చిత్రం సోషియోఫాంటసీ చిత్రమని మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇక ఇటీవల విడుదలైన స్టిల్స్, ట్రైలర్స్ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే బద్రినాథ్ అందరూ అనుకుంటున్నట్లుగా సోషియో ఫాంటసీ చిత్రం కాదని దర్శక నిర్మాతలు అంటున్నారు. చారిత్రక నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రంలో కొంచెం ఫాంటసీ అంశాలు మిక్స్ అయ్యి వుంటాయని..గుడిని కాపాడుకునే నేపథ్యంలో కొనసాగే కథ అని అంటున్నారు.

    అంతే కాదు చిత్రం మొత్తం కూడా స్ట్రైట్ నేరేషన్ లోనే వుంటుందని..ఎటువంటి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు వుండవని కూడా దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని మగధీరతో పోల్చవద్దని అల్లు అరవింద్ మీడియా ముఖంగా చెప్పినా ప్రయోజనం లేకపోయింది. పోలిక ఎలాగో పెడుతున్నారు కాబట్టి అంచనాలు కాస్త తగ్గించడానికి, అలా అని పూర్తిగా నమ్మకం పొగొట్టకుండా చూడడానికి బద్రినాథ్ ని ఇంద్ర సినిమాతో పోల్చుకోమని గీతా ఆర్ట్స్ టీమ్ లోని వాళ్లు చెబుతున్నారు. జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి యంయం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. తమన్నా నాయికగా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

    English summary
    Badrinath is an out and out action masala flick stresses its makers. They don't want it to be compared with Magadheera. Instead they are asking to draw comparisons with Indra, which was a full to commercial entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X