అల్లు అర్జున్ లేటెస్ట్ 'బద్రీనాధ్' సెన్సార్ రిపోర్టు ఏమిటి?
అల్లు అర్జున్,వి వి వినాయిక్ కాంబినేషన్ లో రెడి అయ్యి మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న చిత్రం'బద్రీనాధ్'. ఈ చిత్రం గురించి జనాల్లో ఎంత క్యూరియాసిటి ఉందో అంతకుమించిన టెన్షన్ ట్రేడ్ సర్కిల్స్ లో ఉంది.శక్తి దెబ్బకు గ్రాఫిక్స్ తరహా భారీ బడ్జెట్ సినిమాలు అంటే పరారవుతున్న వారు కేవలం అల్లు అరవింద్ గుడ్ విల్ నే చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారు.అయితే వారంతా తమకున్న పరిచయాలతో సెన్సార్ మెంబర్స్ ని రిపోర్టు కోసం వెంటబడి అడుగుతున్నట్లు సమాచారం.
అయితే సెన్సార్ వారు మాత్రం కర్ర విరక్కుండా పామూ చావకుండా ఈ సమయంలో సినిమా గురించి మాట్లాడకూడదని అంటున్నారు.రెగ్యులర్ గా సెన్సార్ వారికి బాగా నచ్చింది..వారంతా ముక్త కంఠంతో మంచి సినిమా చూసామన్నారు అంటూ సినిమా గురించి వార్తలు వస్తూంటాయి.అయితే ఈ సినిమాకి ఇలా న్యూట్రల్ టాక్ రావటంతో ఆ చిత్రం కోసం మార్కెట్ లో ఉన్నవారు ఏం చేయాలో అర్దం కాక చూస్తున్నారు.గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నే రిలీజయ్యే ఈ చిత్రం సెన్సార్ విషయంలో ఇబ్బందులెదరయ్యాయని,రీ సెన్సార్ చేయాలని వారు పట్టుపట్టారని,దానికి అల్లు అరవింద్ మండిపడ్డాడని అందుకే సెన్సార్ వారు అలా బిహేవ్ చేస్తున్నారని మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో రౌండ్స్ వేస్తోంది.


Click it and Unblock the Notifications











