'మగధీర' తర్వాత సెకండ్ హైయెస్ట్ ‘బద్రినాథే’..డిక్లేర్స్ అరవింద్!
అల్లు అర్జున్, తమన్నా హీరోహీరోయిన్లుగా, వివి వినాయక్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిత్రం బద్రినాథ్, అయితే విడుదలైన తొలిరోజు నుండే నెగిటివ్ టాక్ వినిపించినప్పటికీ, కలెక్షన్లు విషయంలో మాత్రం వినిపితస్తున్న టాక్ కి ఎటువంటి సంబంధం లేదని బద్రినాథ్ చిత్రం నిరూపించుకుంటుంది. ఈ విషయం చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ..చిత్ర సక్సెస్ మీట్ లో స్వయంగా మీడియాకు తెలియజేశారు.
ఆయన బద్రినాథ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గురించి తెలియజేస్తూ తొలివారంలో ఈ చిత్రం 28 కోట్ల 25లక్షల గ్రాస్ ని, 20కోట్ల 75 లక్షల షేర్ ని వసూలు చేసిందని మీడియా సమక్షంలో అధికారికంగా ప్రకటించారు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి వారం హైయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా మొదటిస్థానంలో 'మగధీర" ఉండగా..రెండో స్థానం 'బద్రినాథ్" దే అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
More from Filmibeat
badrinath allu arjun allu aravind vv vinayak tamanna బద్రినాథ్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వివి వినాయక్ తమన్నా


Click it and Unblock the Notifications











