అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తి...
అల్లు అర్జున కథానాయకుడుగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బద్రినాథ్' షూటింగుకు సంబంధించి ఇక మూడు పాటలు మాత్రం మిగిలి వున్నాయి. వీటిని వచ్చే నెలలో చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంచితే, మరోపక్క చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. అలాగే, ప్యాచ్ వర్క్ షూటింగ్ ఈ వారంలో పూర్తి చేస్తారు. అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రాలలో బద్రీనాథ్ ముందుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రూపొందిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫెయిలైన నేపథ్యంలో ఈ చిత్రం పట్ల టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది! జూన్ మొదటి వారంలో దీనిని రిలీజ్ చేస్తారు.
allu arjun tamanna badrinath vv vinayak allu aravind అల్లు అర్జున్ తమన్నా బద్రీనాథ్ వివి వినాయక్ అల్లు అరవింద్


Click it and Unblock the Notifications