మూడు భాషల్లో ఒకే రోజు అల్లు అర్జున్ 'బద్రీనాధ్' రిలీజ్...ఆ డేట్ ఎప్పుడంటే
అల్లు అర్జున్, తమన్నా కాంబినేషన్ లో రూపొందుతున్న "బద్రీనాధ్" చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో ఒకే రోజు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం జూన్ మూడవ తేదిన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ బ్యానర్ పై "బద్రీనాధ్" చిత్రం నిర్మిస్తున్నారు. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథని చిన్ని కృష్ణ అందించారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తాడని, ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తాడని చెప్తున్నారు. తమన్నాకీ అల్లు అర్జున్ కీ వచ్చే ప్రేమ సన్నివేసాలు హైలెట్ గా కనిపించనున్నాయి.
అలాగే కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్..మొదటి చిత్రం గంగోత్రి అనంతరం కీరవాణి మళ్ళీ అల్లు అర్జున్ తో చేయలేదు. ఇక చిన్ని కృష్ణ కూడా గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ కి కథ ఇచ్చిన చిత్రం ఇదే. కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











