'బద్రీనాథ్' రికార్డులు తిరగ రాస్తుంది: కథారచయిత

By Sindhu

అల్లు అర్జున్, తమన్నా ప్రధ్జాన తారాగణంగా వివి. వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం 'బద్రీనాథ్'. ఈ చిత్రం రేపు(జూన్ 10) విడులవుతున్న సందర్భంగా అల్లు రామలింగయ్య హౌస్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. సినిమా గురించి చాలా హై రేంజ్ లో చెప్పేశాడు రచయిత చిన్నికృష్ణ , తన సహజ శైలిలో! తన కొడుకు పేరు బద్రీనాథ్ అనీ, కూతురు పేరు అలకానంద అనీ, ఆ పేర్లనే బద్రీనాథ్ సినిమాలో హీరో హీరోయిన్లకు పెట్టడం జరిగిందనీ చెప్పాడు. భావోద్వేగాలకు పెద్దపీట వేసిన 'బద్రినాధ్‌" సినిమాకి 'నరసింహా నాయు డు", 'ఇంద్ర", 'పోకిరి", 'మగధీర" రికార్డు లను అందుకునే సత్తా ఉంది" అన్నారు చిన్నికృష్ణ. ఆయన కథను అందించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను సమురాయ్‌గా సరికొత్త అవతా రంలో చూపిస్తున్నారు దర్శకు డు వినాయక్‌.

మన భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఈ సినిమాలో పుష్పాలకు ఉన్నటువంటి ఫ్లేవర్ తో పాటు సున్నితత్వం, పవిత్రత వుంటాయి. సినిమా కోసం దాదాపు 22 సెట్స్ వేయడంజరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు లక్షలు ఖర్చు చేసారంటే సినిమా కు ఎంతఖర్చు అయ్యి వుంటుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు.

తను కథ అందించిన సినేమాలన్నిట్లోనూ (నరసింహ, నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి) దైవ సంబంధిత అంశం కచ్చితంగా ఉంటుందనీ, ఇందులో కూడా అటువంటిది ఉందనీ అన్నాడు. తను రచయిత అయ్యాక టాలీవుడ్ లో నరసింహనాయుడు, ఇంద్ర, పోకిరి, మగధీర... వంటి నాలుగు పెద్ద హిట్లు వచ్చాయనీ, ఇప్పుడీ బద్రీనాథ్ ఐదో పెద్ద హిట్ అవుతుందనీ చిన్నికృష్ణ గట్టిగా చెబుతున్నాడు. ఏమైనా, ఆ నాలుగూ కరక్టే కానీ, ఈ సినిమా కూడా ఆ సినిమాల సరసన చేరుతుందో, లేదో డిసైడ్ చేయాలంటే కనుక చిన్నికృష్ణ కూడా రేపటి వరకు ఆగాల్సిందే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X