అల్లు అర్జున్ బద్రీనాధ్ చిత్రం పై నెగిటివ్ టాక్
అల్లు అర్జున్, తమన్నా కాంబినేషన్ లో వి వి వినాయిక్ రూపొందించిన బద్రీనాధ్ చిత్రం ఈ వారంలో నే విడుదల అవుతుంది.మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం గురించి ఎక్కడ చూసినా హాట్ టాపిక్స్ రన్ అవుతున్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోంది..అల్లు అర్జున్ వెరైటీ గెటప్ ఎదుకు వేసారు వంటి విషయాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అస్సలు పరిశ్రమ వర్గాల ప్రీ రిలీజ్ టాక్ ఏమిటి అనేది పరిశీలిస్తే..వారు ఫస్టాఫ్ సూపర్బ్ గా వచ్చిందని,ముఖ్యంగా అల్లు అర్జున్ ,విలన్ కి మధ్య వచ్చే ఎపిసోడ్స్ హైలట్ అనీ,పాటలు ఉర్రూతలూగిస్తాయని చెప్తున్నారు.
అయితే సెకండాఫ్ లోనే డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటుందని చెప్తున్నారు.అయితే అస్సలు ఈ టాక చెప్పవారు ఎంతమంది సినిమా చూసారన్నది ప్రశ్న.శక్తి సినిమాను దృష్టిలో పెట్టుకుని ఇలా నెగిటవ్ గా చెప్తున్నారంటున్నారు.అంతేగాక ఒక వర్గం పనిగట్టుకుని మరీ ఈ ప్రచారం నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ట్రైలర్స్ చూసిన వారు మాతర్ సినిమా సూపర్బ్ గా ఉండబోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. వారి అంచనాలను మించే సినిమా ఉంటుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











