‘బద్రీనాథ్’మరో మగధీర’ కాబోతోందా..? లేక శక్తి కాబోతోందా..?
టాలీవుడ్ కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తాజాగా 'బద్రీనాథ్' సినిమాతో ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వాల్‌పోస్టర్స్‌ను చిత్ర నిర్మాత సోమవారం విడుదల చేశారు. పోస్టర్స్‌ను చూస్తుంటే... సిక్స్ ప్యాక్ కండలతో బలిష్టంగా కత్తి పట్టుకుని దర్శనమిస్తున్నాడు అర్జున్. చిత్ర కథ ఏమిటన్నది చెప్పకుండా ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌కు మంచి బ్రేక్ నిస్తుందంటున్నారు దర్శకులు. మరి అది ఎటువంటి బ్రేకో చూడాలి.
సోషియో ఫాంటసీ కథలకు ఎక్కడా లేని గిరాకీ తెచ్చిన 'మగధీర"ను చూసి ఖర్చుకు వెనకాడకుండా తయారు చేసిన శక్తి గాలి తీశారు తెలుగు ప్రేక్షకులు. ఎలా అంటారా జూ ఎన్టీఆర్... కండలు చూపలేదు కానీ, జూలు పెంచి కత్తి పట్టి ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్లేందుకు యత్నించాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయారు. ఫలితంగా థియేటర్ల వద్ద 'శక్తి"కి ఆదరణ అంతంత మాత్రంగానే కనబడుతోంది. శక్తి కి ముందు'అనగనగా ఓ ధీరుడు" కూడా ధీనంగానే వెనుదిరిగాడు. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నా ఫలితం వుండకపోవటంతో అసలు ఈ ఫాంటసీ కథలకు అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు ఇంకొందరు నిర్మాతలు. ఈ నేపధ్యంలో మరో సోషియో ఫాంటసీ చిత్రం 'బద్రీనాథ్"గా వస్తున్న అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.
అశ్వినీదత్ మాదిరిగానే అదే కోవలో వివి వినాయక్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు ఎక్కువే వున్నాయి. బావ రామ్ చరణ్ ని కాలభైరవుడిగా చూసిన క్షణం నుండి కలలు కన్న అల్లు అర్జున్ 'బద్రీనాథ్" పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరైతే 'బద్రీనాథ్" మరో మగధీర" కాబోతోందా? లేక శక్తి కాబోతోందా? వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











