»   » బల్లాల దేవుడి కొడుకు: ఆన్సర్ ఇదేనట (నవ్వుకోవద్దు ప్లీజ్)

బల్లాల దేవుడి కొడుకు: ఆన్సర్ ఇదేనట (నవ్వుకోవద్దు ప్లీజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? నిన్నా మొన్నటి వరకూ అందరినీ వేదించిన ప్రశ్న ఇది... బాహుబలి ది కంక్లూజన్ లో దీనికి సమాధానం వచ్చేసింది. అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ 2 మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడి ముందుంచింది. ఎంత గొప్ప సినిమా అయినా ఏక్కడో ఒక చిన్న తప్పు దొర్లిపోతుంది. ఆ తప్పు మాత్రం మొత్తం అయిపోయాక తీరిగ్గా ప్రేక్షకుడి కంట్లో పడుతుంది.ఇప్పుడు బాహుబలి లోనూ అలాంటే తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు.

 శివుడు చంపేస్తాడు.

శివుడు చంపేస్తాడు.

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కంక్లూజన్ బాహుబలి 2 లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రల ఊసే కనిపించక పోవటం ఆశ్చర్య పరిచింది. అదేమిటంటే.... భల్లాల దేవుడి పెళ్ళి విషయం. బాహుబలి: ది బిగినింగ్‌'లో భళ్లాలదేవుడికి కొడుకు ఉన్నట్టు చూపించారు. (ఈ పాత్ర అడివి శేష్ చేసాడు ) ఆ కొడుకును ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కు ముందు శివుడు చంపేస్తాడు.


కథలో కీలకమైన పాత్ర

కథలో కీలకమైన పాత్ర "భల్లాల దేవుడిది"

అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవడం, కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు. అసలు దేవసేనని కోరుకున్న భల్లాల దేవుడు అలా పెళ్ళి లేకుండానే మిగిలి పోయినట్టయితే కొడుకు పుట్టటం అనే మాటే లేదు.భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్టయితే "యువరాజు" ఎలా అవుతాడు? పోనీ పెళ్ళయ్యింది అనుకున్నా కథలో కీలకమైన పాత్ర "భల్లాల దేవుడిది" మరి అతను పెళ్ళి చేసుకొని ఉంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే...


ఎడిటింగ్ లో ఆ పార్ట్ ఎగిరి పోయిందా..?

ఎడిటింగ్ లో ఆ పార్ట్ ఎగిరి పోయిందా..?

అంతెత్తు ఎదిగిన కొడుకుని చూపించినా భల్లాల దేవుడి భార్య ని మాత్రం చూపించనే లేదు.అసలు విశయం ఏమిటంటే రెండో భాగం చూస్తే అసలు రానాకు పెళ్లి కానట్టే అనిపిస్తుంది. ఎక్కడా తన రాజ్యాన్ని కాపాడే పుత్రున్నిచ్చిన భార్య గురించి గానీ కనీసం రానాతో కనిపించే ఒక్క లేడీ పాత్ర గానీ లేదు. ఈ విశయం మర్చి పోయారా? లేదంటే ఎడిటింగ్ లో ఆ పార్ట్ ఎగిరి పోయిందా..? అన్న ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.


వీరాభిమానులు

వీరాభిమానులు

అయితే ఈ ప్రశ్నకు బాహుబలి2 అభిమానులు కొందరు సమాధానం తమకు తెలుసంటున్నారు. కొన్ని ఫేబుక్ పోస్టుల్లో బాహుబలిని విమర్శించే హక్కు ఎవరికీ లేదంటూ పోస్టులు పెడుతున్న వీరాభిమానులు ఇప్పుడు సినిమాలోని చిన్న పొరపాట్లని చూపించటం కూడా సహించలేకపోతున్నారు.


 భద్ర అతని దత్త పుత్రుడట

భద్ర అతని దత్త పుత్రుడట

అదే క్రమం లో బళ్ళాల దేవుని కొడుకు విషయాన్ని కూడా ఇలా "కవర్" చేస్తున్నారు. భల్లాలదేవుడు దేవసేన తనకు దక్కకపోవడంతో అసలు పెళ్లే చేసుకోలేదని, భద్ర అతని దత్త పుత్రుడనే కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అదే నిజమైతే సినిమాలో చూపించి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ ప్రశ్నకు రాజమౌళి స్వయంగా సమాధానం చెబితే తప్ప నెటిజన్లు ఈ చర్చకు చెక్ పెట్టేలా కనిపించడం లేదు.English summary
Rajamouli has to answer for many questions that he did not reveal in Baahubali: The Beginning. Why did Katappa kill Bahubali is the one question which is on minds of many people? But who is wife of Bhallaladeva?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu