»   » ‘బాహుబలి-2’ షూటింగ్ నుండి లీక్... (ఫోటోస్)

‘బాహుబలి-2’ షూటింగ్ నుండి లీక్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి.

ఫోటోస్ చూస్తుంటే... రాయలసీమలోని క్వారీలో షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోస్ సినిమాలో ఎక్కడ వస్తాయి? అనేది తెలియాల్సి ఉంది. అయితే సినిమాలో ఇక్కడ ఫోటోలో ఉన్నట్లు కనిపించే అవకాశం లేదు. గ్రాఫిక్స్ కలిసిన తర్వాత లుక్ డిఫరెంటుగా కనిపించబతోంది.


సెట్లో... స్తంబాలను పోలి ఉన్నవి తాటి చెట్ల కాండాలు. ఆర్టిఫిషియల్ గా తెచ్చ ఇక్కడ నాటారు. గ్రాపిక్స్ లో వాటికి ఆకులు, ఇతర హంగులు అద్దనున్నారు. సినిమాలో చెట్లు ఎక్కే సీన్ ఏమైనా ఉంటుంది కాబోలు.


బాముబలి-2

బాముబలి-2

రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత ఇంట్రెస్టింగ్

మరింత ఇంట్రెస్టింగ్

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

2017, ఏప్రిల్ 28న విడుదలవుతుంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో 'బాహుబలి'ని విడుదల చేసిన కరణ్‌... రెండో పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ హిందీ వర్షెన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు.


సత్తా చాటిన చిత్రం

సత్తా చాటిన చిత్రం

బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.


అసలు కథ కథంతా

అసలు కథ కథంతా

బాహుబలి పార్ట్ 1లో కేవలం పాత్రల ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. అసలు స్టోరీ అంతా పార్ట్ 2లోనే ఉండబోతోంది. తొలి భాగం కంటే రెండో భాగంలో మరింత ఆసక్తి కరంగా సాగబోతోంది.యుద్ధ సన్నివేశాలు

యుద్ధ సన్నివేశాలు

బాహుబలి 2లో యుద్ద సన్నివేశాలు తొలి భాగాన్ని మించేలా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని రాజమౌళి కూడా ఆ మధ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలి భాగం కంటే రెండో భాగానికి ఖర్చు కూడా భారీగానే పెడుతున్నారు.


ఎలాంటి లోపాలు లేకుండా

ఎలాంటి లోపాలు లేకుండా

బాహుబలి సినిమా వెనక మాస్టర్ మైండ్ రాజమౌళి. ఆయన లేకుంటే తెలుగులో ఇంత పెద్ద సినిమా ఉండేదే కాదు. అయితే తొలి భాగంలో కొన్ని లోపాలు ఉండటంతో విమర్శలు వచ్చాయి. అయితే రెండో భాగంలో అలాంటివేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి.


English summary
Bahubali 2 Shooting Leaked Photos. Baahubali: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu