twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతను గట్టిగా చెప్పగానే కంగారు పడిన ప్రభాస్.. వెంటనే దగ్గరకు వెళ్లి ఊహించని విధంగా..

    |

    ప్రభాస్ అనగానే ఎవరికైనా సరే డార్లింగ్ అనే పేరే ఎక్కువగా గుర్తొస్తుంది. ఎలాంటి సందర్భంలో అయినా సరే కూల్ గా ఉంటూ నలుగురితో సరదాగా మాట్లాడుతుంటారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చినా ప్రభాస్ గురించి ఇష్టాంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక సీనియర్ మోస్ట్ నటులలో ఒకరైన కోసరాజు అదిత్య కూడా ప్రభాస్ మంచితనం గురించి వివరణ ఇచ్చారు.

    యాక్టింగ్ తోనే కాకుండా

    యాక్టింగ్ తోనే కాకుండా

    ప్రభాస్ మంచితనం గురించి దాదాపు అభిమానులందరికి తెలిసిన విషయమే. కేవలం బిగ్ స్క్రీన్ పై యాక్టింగ్ తోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి పనులతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక అందరిని సమానంగా ప్రేమతో డార్లింగ్ అని పిలుస్తుంటారు. నేటితరం కొంతమంది యువ హీరోలు కూడా ఆయన అభిమానులే.

     పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం అతనే

    పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం అతనే

    ప్రభాస్ కు అత్యంత దగ్గరగా ఉండే హీరోల లిస్ట్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్ కు ఎంత పెద్ద స్టార్ క్లోజ్ అయినా కూడా ఎప్పటికి పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం గోపిచంద్ మాత్రమే. వర్షం సినిమా కంటే ముందే అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో గోపి ప్రభాస్ కు చాలా దగ్గరయ్యాడు.

     నమ్మకం కలిగితే

    నమ్మకం కలిగితే

    ఇక ప్రభాస్ తో ఒక్కసారి స్నేహం చేస్తే ఎవరైనా సరే మళ్ళీ అతన్ని వదలరు. రెబల్ స్టార్ అసిస్టెంట్ నుంచి నిర్మతల వరకు అందరూ కూడా అతని స్నేహితులే. నమ్మకం కలిగితే వారికి ఎదో ఒక జాబ్ ఇచ్చి తన దగ్గరే సెట్ చేసుకుంటాడు. యూవీ నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్, కమెడియన్ ప్రభాస్ శ్రీను కూడా డార్లింగ్ సపోర్ట్ తో వచ్చిన వారే.

    కంగారు పడిన ప్రభాస్

    కంగారు పడిన ప్రభాస్

    ఇక బాహుబలిలో 'ఈశాన్యం బరువు పెరిగిపోయింది' అనే డైలాగ్ తో బాగా క్రేజ్ అందుకున్న నటుడు కోసరాజు ఆదిత్య కూడా ప్రభాస్ మంచితనం గురించి చెప్పాడు. ఆయన మాట్లాడుతూ బాహుబలి షూటింగ్ సమయంలో యుద్ధానికి సిద్ధమైనప్పుడు మూగ జీవిని బలి ఇచ్చే క్రమంలో 'బలి ఇవ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది' యువరాజా అనే డైలాగ్ చెప్పినప్పుడు ప్రభాస్ కంగారు పడ్డాడట.

    Recommended Video

    Karthik Rapolu Gives Suggestions To Debut Directors | Ek Mini Katha
    ప్రభాస్ అలా వినయంగా..

    ప్రభాస్ అలా వినయంగా..


    డైలాగ్ అనంతరం ప్రభాస్ నా దగ్గరకు వస్తుండడంతో నేను కాస్త కంగారు పడ్డాను. కానీ ఆయన ఎంతో వినయంగా ''డార్లింగ్ ఏమి అనుకోవద్దు. కొంచెం స్లోగా చెప్పవా.. నువ్వు అలా చెబితే నా డైలాగ్ మర్చిపోతున్నాను'' అంటూ వివరణ ఇచ్చారు. అలా చెప్పగానే నేను ఎంతగానో ఆనందించాను. అంత పెద్ద స్టార్ అంత సింపుల్ గా చెప్పడం నేను నా జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది అంటూ ఆదిత్య వివరణ ఇచ్చారు.

    English summary
    Bahubali is the only film that has once again set the standard of the Telugu film industry in front of the film world. Directed by Rajamouli, this epic action film is known for its two parts. It has been 4 years since the release of Bahubali 2: The Conclusion, the highest grossing Indian film worldwide. If you take a look at the interesting things related to the movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X