'బాహుబలి' : రమ్యకృష్ణ కళ్ళపై క్లాప్‌ (ఫొటో)

By Surya

హైదరాబాద్‌: 'ఇది నా మాట.. నా మాటే శాసనం' అంటూ... 'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్రను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రమ్యకృష్ణ. అయితే బుధవారం 'బాహుబలి' చిత్ర యూనిట్ తమ అధికారిక ట్విట్టర్‌,ఫేస్ బుక్ ఖాతా ద్వారా రమ్యకృష్ణపై క్లాప్‌ కొడుతున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

The eyes that could silence an entire Kingdom - our beloved Sivagami! #BaahubaliMemories

Posted by Baahubali on 4 November 2015

'ఆ కళ్లు మొత్తంరాజ్యాన్నే శాసించాయి' అంటూ ట్వీట్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. జులై 10న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

Ramyakrishna
విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 100 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.

తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X