షాకింగ్ : ఎటు చూసినా బాహుబలి కటౌట్సే (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' . రేపు విడుదల అవుతున్న ఈ చిత్రం యావత్‌ భారతదేశ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోగా చేసిన ప్రభాస్ సొంత ప్రాంతమైన భీమవరంలో ఈ చిత్రం కటౌట్స్ పెట్టారు. ఒకటి రెండు కటౌట్స్ కాదు. ఎటు చూసినా అవే..మీరే ఈ వీడియో ని చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజమౌళి మాట్లాడుతూ... ''బాహుబలి' అందరికీ వర్తించే మానవ సంబంధాలకు సంబంధించిన కథ. అందుకే ఇన్ని భాషల్లో విడుదల చేస్తున్నాము''అన్నారు.

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ... ''ప్రతి చిత్రం దేశమంతా చూసేలా ఉండకపోవచ్చు. అందరూ చూసే అంశాలు మన చిత్రంలో ఏముండాలో మనకు తెలిసుండాలి. మా చిత్రంలో గొప్ప విజువల్‌ ఎఫెక్ట్స్‌, భారీతనం... ఇవే కాదు అంతకుమించిన బలమైన పాత్రలున్నాయి. మానవ సంబంధాలు, భావోద్వేగాల్ని హృద్యంగా ఆవిష్కరించాం. ఇది ప్రాంతీయ చిత్రం కాదు. జాతీయ చిత్రమని అన్నారు.

Bahubali Huge Cutouts - Bhimavaram Prabhas Fans Hungama

ఇక రాజమోళి... బాహుబలిని హిందీలో విడుదల చేస్తున్న కరణ్‌జోహార్‌ గురించి చెబుతూ, ''భావజాలం విషయంలో కరణ్‌కు, నాకూ చాలా వైరుధ్యం ఉండవచ్చు కానీ సినిమాపై ప్రేమ విషయంలో మేం ఇద్దరమూ ఒకటే''అన్నారు రాజమౌళి.

ఇక ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కు వస్తే...

తెలుగుతో పాటు తమిళం, మళయాలం, హిందీ భాషల్లోనూ రేపు...(జూలై 10) నే విడుదల కానుంది. ఈ సినిమా, దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసాయి.

ఈ చిత్రానికి నిన్నటి ఉదయం నుంచే ప్రధాన థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్‌ను మొదలుపెట్టేశారు. ఆన్‌లైన్‌లో నిమిషం కూడా టికెట్లు అందుబాటులో లేకుండా అమ్ముడైపోవడం సంచలనమైంది. అలాగే..., మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా బుకింగ్స్ కోసం అభిమానులు భారీ సంఖ్యంలో హాజరు అయ్యారు.

ముఖ్యంగా హైద్రాబాద్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని మల్టిప్లెక్సుల్లో టికెట్ల బుకింగ్ మొదలుకాగా, బుకింగ్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరి కనిపించారు. చాలా చోట్ల కిలోమీటర్ మేర క్యూ ఉండడం జరిగింది.

మరో ప్రక్క ముందు రోజు అంటే ఈ రోజు (గురువారం) అర్థరాత్రి ప్రదర్శితమయ్యే బెనిఫిట్ షోలకు కనీవినీ ఎరుగని రీతిలో టిక్కెట్ పెట్టారు. వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X