‘బాహుబలి’ రిలీజ్ డేట్ ఖరారైంది
హైదరాబాద్: ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్ర ధారులుగా డైరెక్టర్ రాజమౌళి 'బాహుబలి' టైటిల్‌తో చారిత్రాక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ రాని విధంగా కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
2015లో విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం రిలీజ్ డేట్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17, 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు....ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ చిత్రం హాట్ టాపిక్ కానుంది. సినిమాను ఎలాగైన ఏప్రిల్ 2015 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్న రాజమౌళి....స్పీడు పెంచారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.


Click it and Unblock the Notifications











