బాహుబలి: ప్రభాస్ దీపావళి స్పెషల్ లుక్ (ఫోటో)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు ‘బాహుబలి' కొత్త పోస్టర్‌తో తెలియజేసాడు. విల్లంబు ఎక్కుపెట్టి ఉన్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. యుద్ధ క్షేత్రంలో ప్రభాస్ పోరాటానికి సంబంధించిన ఫోటో ఇది. నా అభిమానులందరికి దీపావళి శుభాకాంక్షలు. బాహుబలి నుండి ఈ చిత్రం, మీ కోసం ప్రత్యేకం అంటూ ప్రభాస్ తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నాడు.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఇది తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ రాని విధంగా కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయనుంది.
2015లో విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం రిలీజ్ డేట్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17, 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











