twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు పెద్ద కష్టమే.. ఆ విషయంలో 'వీక్' అని ఒప్పుకున్నాడు; ఇక మళ్లీ అలా చేయడట..

    |

    'బాహుబలి'తో ప్రభాస్ దశా దిశా పూర్తిగా మారిపోయాయి. ఐదేళ్ల పాటు పూర్తి సమయాన్ని దానికే వెచ్చించినా.. అందుకు తగ్గ ఫలితాన్నే పొందాడు. కాబట్టే.. కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే భాషా సమస్య మాత్రం ప్రభాస్ ను వెంటాడుతూనే ఉంది. ఈ విషయాన్ని ప్రభాసే స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఆ విశేషాలు ప్రభాస్ మాటల్లోనే..

    అమెరికాలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు?: ఎందుకు వెళ్లాడో తెలుసా..అమెరికాలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు?: ఎందుకు వెళ్లాడో తెలుసా..

     హిందీ నాకు కష్టమే..:

    హిందీ నాకు కష్టమే..:

    కథ నచ్చితే దేశంలోని ఏ భాషలోనైనా నటించడానికి నేను సిద్దమే. భాష, ప్రాంతం లాంటి హద్దులు నాకేమి లేవు. అయితే నేను హిందీలో నటించినా సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం కష్టమే. రాయడం, చదవడం వరకు ఓకె గానీ హిందీలో అంత ధారళంగా మాట్లాడలేను. పైగా నా యాస మిక్స్ అయి ఉంటుంది. అయితే దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాను.

    Recommended Video

    Shraddha Kapoor playing dual role in Saaho ?
    విలన్‌ పాత్రకూ రెడీ:

    విలన్‌ పాత్రకూ రెడీ:

    ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం.. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాల పైనే. విభిన్న పాత్రల్లోనూ నటించాలని ఉంది. ఇప్పుడు కాదు కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా 'విలన్' పాత్రలు కూడా చేస్తానేమో!.

     ఇక అలా చేయలేను..:

    ఇక అలా చేయలేను..:

    బాహుబలికి కేటాయించినట్లుగా మరే సినిమాకు ఐదేళ్లు కేటాయించలేను. ఎందుకంటే నటుల జీవితంలో సమయం చాలా విలువైంది. అందుకే మరే సినిమాకు ఐదేళ్లు కేటాయించే ఆలోచన లేదు.

     ఒకవేళ అలా కేటాయించినా..:

    ఒకవేళ అలా కేటాయించినా..:

    ఒకవేళ ఐదేళ్లు గనుక ఒకే సినిమాకు కేటాయించాల్సి వస్తే.. అదే సమయంలో వేరే సినిమాల్లోనూ నటిస్తా. అలా అయితేనే ప్రాజెక్ట్ కమిట్ అవుతా. అదే నా కెరీర్‌కు మంచిది. అయినా దృష్టిలో 'బాహుబలి' జీవితానికి ఒక అవకాశం అంతే.

     కథ నచ్చితే..:

    కథ నచ్చితే..:

    'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చేసే సినిమాలన్ని కేవలం ఒక్క భాషా ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేయట్లేదు. కథ నచ్చితే భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమా చేస్తా.

     ఎలా అధిగమిస్తాడో..

    ఎలా అధిగమిస్తాడో..

    బాహుబలి హిందీ రిలీజ్ సమయంలోనే ప్రభాస్ భాషా సమస్య బయటపడింది. ప్రెస్ మీట్స్‌లో అనుష్క ప్రభాస్ లాంగ్వేజ్‌ను కవర్ చేసే ప్రయత్నం అంతా గమనించారు. భవిష్యత్తులో సౌత్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదగాలనుకుంటున్న ప్రభాస్‌కు భాషా సమస్య పెద్ద తలనొప్పిలా తయారైంది. మరి ఈ సమస్యను ప్రభాస్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

    English summary
    While speaking on his recent interview, Bahubali Prabhas said that he is ready to appear in Villain role also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X