twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి ప్రెస్ మీట్: క్షమాపణ చెప్పిన ప్రభాస్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చాలా కాలం తర్వాత ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ కు హాజరైన ప్రభాస్, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగర్డ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

    ఈ చిత్రం ఆడియో వేడుక కోసం ప్రభాస్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ 31న ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ, ఈ వేడుక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి కారణాన్ని వెల్లడించారు.

    ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ...''ఫ్యాన్స్ అందర్నీ కలిసి రెండేళ్లయ్యింది. సెక్యుర్టీ రీజన్స్ వల్ల బాహుబలి వేడుక చేయలేకపోతున్నాం. తదుపరి తేదీని ప్రకటిస్తాం. అభిమానులందరికీ క్షమాపణలు'' అని ప్రభాస్ తెలిపాడు.

    ప్రేక్షకులను కలిసి చాలా కాలం అయింది.బాహుబలి మొదలయ్యాక వారిని కలవడం కుదరలేదు. సినిమా మొదలయ్యాక మధ్యలో భారీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలు చెప్పాలనుకున్నాను. కానీ అవకాశం దొరకలేదు. ఆడియో ఫంక్షన్ మే 31న అభిమానులు, ప్రేక్షకుల మధ్య గ్రాండ్ గా విడుదల చేయాలనుకున్నాం. సినిమా విడుదల ఎలాగైతే ఆలస్యం అయిందో ఆడియో వేడుక కూడా వాయిదా పడుతోందని రాజమౌళి తెలిపారు.

    మే 31 హైటెక్స్ గ్రౌండ్ లో గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేసాం. మరుసటి రోజు ముంబైలో టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేసాం. అయితే ‘గోపాల గోపాల', ‘మిర్చి', ‘బాద్ షా' సినిమాల సమయంలో జరిగిన సంఘటనల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆడియో ఫంక్షన్లకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. అలాంటపుడు కొంత మందిని మాత్రమే లోనికి అనుమతించి ఫంక్షన్ చేసుకోవడం కరెక్టు కాదనిపించింది. అందుకే ఆడియో వేడుక ఫంక్షన్ పోస్ట్ పోన్ చేసాం. తర్వాత ఏం చేయాలనే దానిపై ప్లాన్ లేదు. కొన్ని ఆప్షన్స్ మైండ్ లో ఉన్నాయి. దాని ప్రకారం వర్కవుట్ చేస్తున్నాం. ఇలా జరిగినందుకు ఫ్యాన్స్, ప్రేక్షకులు క్షమాపణ చెబుతున్నాం అన్నారు రాజమౌళి.

    అందరూ కాస్త ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాను. ప్రభాస్ ను ఫ్యాన్స్ వద్దకు తీసుకెల్లడమా? లేదా ఫ్యాన్స్ నే ఇక్కడికి తీసుకురావడమా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఫ్యాన్స్ ను డిస్పప్పాయింట్ చేసామనే బాధ ఉంది. కానీ వారి క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బాహుబలి ఆడియోపై ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ల హీరోని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తుంటారు. భీమవరం, ఖమ్మం, వరంగల్, కర్నూలు వంటి కొన్ని ప్రాంతాల్లో మేమే ఆర్గనైజ్ చేస్తాం, మీ టీంతో వచ్చేమని కూడా అభిమానులు చెబుతున్నారంటే అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జరిగినందుకు బాధగానే ఉంది. హిందీలో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ మాత్రమే జరుగుతుంది. హిందీ ట్రైలర్, తెలుగు ట్రైల్ వేర్వేరుగా ఉంటాయి' అని రాజమౌళి తెలిపారు.

    స్లైడ్ షోలో ఫోటోలు...

    బాహుబలి ప్రెస్ మీట్

    బాహుబలి ప్రెస్ మీట్


    బాహుబలి ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. పలు ముఖ్యమైన విషయాలు తెలిపారు.

    ప్రభాస్ క్షమాపణ

    ప్రభాస్ క్షమాపణ


    ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ...''ఫ్యాన్స్ అందర్నీ కలిసి రెండేళ్లయ్యింది. సెక్యుర్టీ రీజన్స్ వల్ల బాహుబలి వేడుక చేయలేకపోతున్నాం. తదుపరి తేదీని ప్రకటిస్తాం. అభిమానులందరికీ క్షమాపణలు'' అని ప్రభాస్ తెలిపాడు.

    రాజమౌళి

    రాజమౌళి


    'ఆడియో వేడుకకు కొంత మందిని మాత్రమే అనుమతి ఇస్తామని అంటున్నారు. కొందరిని మాత్రమే అనుమతించి ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచడం ఇష్టం లేదు అన్నారు.

    త్వరలో...

    త్వరలో...


    బాహుబలి ఆడియో వేడుక గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. త్వరలో ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తారు

    English summary
    Prabhas, Rajamouli at Baahubali movie Press Meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X