రూ. 90 కోట్ల బిల్లు, రాజమౌళి అప్‌సెట్ ... భగ్గుమన్న బాహుబలి నిర్మాతలు!

By Bojja Kumar

Recommended Video

Bahubali Producer Shobu Yarlagadda Tweet About Yellow Journalism

రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి ప్రాజెక్టు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2 పార్టులుగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా 2 వేల కోట్లకుపైగా వసూలు చేసింది. తాజాగా బాహుబలికి ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త నిర్మాతలకు కోపం తెప్పించింది. వెంటనే శోభు యార్లగడ్డ దీనిపై స్పందించారు. కేవలం సెన్సేషన్ కోసం ఇలాంటి వార్తలు రాయవద్దని, మీ వైఖరి ఇలాగే సాగితే ప్రజల్లో మీ మీద నమ్మకం పోతుందని చురకలంటించారు.

నిర్మాతలకు కోపం తెప్పించిన ఆ వార్త ఏమిటి?

నిర్మాతలకు కోపం తెప్పించిన ఆ వార్త ఏమిటి?

సుధీర్ఘ కాలం పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి షూటింగ్ జరుపుకున్నందుకు, భారీ సెట్లు వేసుకున్నందుకు రామోజీరావు రూ. 90 కోట్ల బిల్లు వేశారని, ఇంత బిల్లు వేస్తారని ఊహించని బాహుబలి నిర్మాతలు షాకయ్యారని ఓ ప్రముఖ మీడియా వెబ్ సైట్లో వార్తలు వచ్చాయి.

అర్థంలేని వార్తలు ప్రచురించిన వైనం

అర్థంలేని వార్తలు ప్రచురించిన వైనం

రామోజీరావు అంత బిల్లు వేయడంతో రాజమౌళి చాలా అప్ సెట్ అయ్యారని.... ఇకపై రామోజీ ఫిల్మ్ సిటీలో ముందు ముందు తాను తీయబోయే ఫిల్మ్స్ తీయకూడదని జక్కన్న నిర్ణయించుకున్నట్లు అర్థంలేని వార్తలు రాయడంతో నిర్మాతలు ఆగ్రహానికి గురయ్యారు.

ఈ వార్తలపై శోభు యార్లగడ్డ ఆగ్రహం

ఈ గాసిప్ వార్తలపై బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం వల్ల మీరు కొందరి దృష్టిని ఆకర్షించవచ్చు. కానీ ఇదే తీరు కొనసాగితే మీ వెబ్ సైట్ గాసిప్ వెబ్ సైట్ అనే ముద్ర పడుతుంది. ప్రజల్లో మీ మీద నమ్మకం పోతుంది. ఇలాంటి ఎల్లో జర్నలిజం ఇప్పటికైనా ఆపండి అంటూ ఫైర్ అయ్యారు.

ముక్కు సూటిగా మాట్లాడే శోభు

ముక్కు సూటిగా మాట్లాడే శోభు

శోభు యార్లగడ్డ సినిమా రంగానికి చెందిన ఏదైనా తనకు తప్పుగా అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. గతంలో కొన్ని పెద్ద సినిమాలపై విడుదల ముందే నెగెటివ్ పబ్లిసిటీ చేసిన వారిపై ఆయన ట్విట్టర్ ద్వారా మండి పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X