»   » వేల మంది పనిచేసాం...., బాహుబలి ఒక్కటే 10 సినిమాలకు సమానం: సెబు సిరిల్

వేల మంది పనిచేసాం...., బాహుబలి ఒక్కటే 10 సినిమాలకు సమానం: సెబు సిరిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

2017 లో వచ్చే సినిమాల్లో అన్నిటికంటే క్రేజీయెస్ట్ సినిమాగా వస్తున్న బాహుబలి 2 గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషనల్ అయిపోతోంది. వేలమంది ఒక సినిమాకోసమే పని చేయటం ఇప్పటివరకూ భారతీయ సినీ చరిత్ర లోనే లేదు. అయితే ఇన్ని వేలమంది కేవలం తెరమీద కనిపించే నటులేనా అంటే సినిమా వెనుక ఉన్నవారి సంఖ్యా అంతే స్తాయిలో ఉంది. ఒక్కొక్క సెట్ వేత్యటానికీ, సినిమాలోని యుద్ద సన్నివేశాలను తీర్చి దిద్దటానికీ పనిచేసిన వారే వేల మంది ఉన్నారు. ఒక్క సారి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న శిబు సెరిల్ మాటల్లో వుఇంటే....

బాహుబలి సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్న సెబు సిరిల్ ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. బాహుబలి సినిమాకు రోజుకు దాదాపు 2వేల మందికి పైగా పనిచేసేవారని సిరిల్ చెప్పాడు. బాహుబలి సినిమా ప్రారంభంలోనే ఐదు సంవత్సరాల పాటు వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపాడు. బాహుబలి రెండు పార్టులకు పనిచేయడం... 10 సినిమాలకు పనిచేయడంతో సమానమని చెప్పాడు. తాను బాహుబలి కోసం ఇంజనీర్‌గా, ఆర్టిటెక్చర్‌గా కూడా మారాల్సొచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.


'Bahubali' production designer Sabu Cyril About Bahubali

సెట్స్ వేయడానికి రోజుకు 500 నుంచి 2000 మంది పనిచేసేవారని సిరిల్ చెప్పడం విశేషం. బాహుబలి 2 సినిమాలోని ఒక్కో ఫ్రేమ్ ప్రేక్షకులను మైమరిపిస్తుందని, కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ సినిమాగా బాహుబలి2 నిలుస్తుందని తెలిపాడు. ఏప్రిల్ 28, 2017న బాహుబలి 2 విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలపై పుకార్లు షికారు చేస్తున్నాయి. బాహుబలి 2 విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని, అనుకున్న తేదీకి ఎట్టి పరిస్థితుల్లో విడుదలవుతుందని ఈ సినిమా టీం తేల్చేసింది.

English summary
Three and a half years ago, the four-time National Award winner moved to Hyderabad to give shape to director Rajamouli’s vision. “He came to Bombay and narrated the story. I knew it was a period film with a fictitious kingdom. I understood the scale of the film he had envisioned when he showed me an image of a gigantic waterfall on Photoshop,” says Cyril.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu