»   » డిఫరెంట్ ప్లేస్‌లో ‘బాహుబలి’ ఆడియో

డిఫరెంట్ ప్లేస్‌లో ‘బాహుబలి’ ఆడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' ఆడియో మే 31న హైటెక్స్‌లో జరుగాల్సి ఉండగా.... భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆడియో వేడుక వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త డిసప్పాయింటుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి దర్శక నిర్మాతలు డిఫరెంటుగా థింక్ చేసారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' ఆడియో వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడయితే అనుమతుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. స్థలం కూడా కావాల్సినంత ఉంటుంది కాబట్టి ఎంత మంది అభిమానులు వచ్చినా సమస్య ఉండదని అంటున్నారు. జులై 10న ఆడియో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.


Bahubali's Audio Launch at Ramoji Film City

ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' థియేట్రికల్ ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన ట్రైలర్ కు మిలయన్ల కొద్దీ హిట్స్ వచ్చాయి. ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.


రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రంగా నిలిపోనుంది. అంతర్జాతీయ స్టాండర్ట్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10 సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

English summary
To all those fans of Young Rebel Star Prabhas, who got disappointed with the postponement of Baahubali's audio launch, here a good news for them. The makers have reportedly zeroed the audio launch date as June 10. Interestingly, a different venue has been chosen for celebrating this occasion and the venue is none other than Ramoji Film City. The makers will not get any problems from police and huge turn up is expected.
Please Wait while comments are loading...