ఖరీదైన బాహుబలి సెట్లో ప్రభాస్ నిశ్చితార్థం!
తాజాగా అందుతున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ప్రస్తుతం ఇక్కడ సినిమాలోని ఓ నిశ్చితార్థం సీన్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు...టోటల్ భారతీయ సినిమాకే తలమానికంగా ఉండేలా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.
దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












