అనుష్క, ప్రభాస్ ప్రస్తుతం అక్కడున్నారు.. అందుకోసమే వెళ్లారు.. వైరలవుతోన్న పిక్
బాహుబలి సినిమా తెలుగు సినీ చిత్ర సీమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. టాలీవుడ్ సినిమాలు వందకోట్లు కలెక్ట్ చేస్తే గొప్ప అనుకునే మనం.. రెండు వేలకోట్లను కొల్లగొడుతుందని కళ్లో కూడా ఎవ్వరూ అనుకుని ఉండరు. కానీ దర్శకధీరుడు జక్కన ఆ కలను నిజం చేశాడు.

బాహుబలి సినిమాతో ఖ్యాతి పెంచిన రాజమౌళి..
బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ను పెంచిన రాజమౌళి.. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించాలనుకునే దర్శకులు, నిర్మాతలకు కొండంత ధైర్యమిచ్చారు. బాహుబలి సినిమాలు వచ్చి మూడేళ్లు అవుతున్నా.. అవి నెలకొల్పిన రికార్డులను మరే చిత్రాలు కూడా బద్దలుకొట్టలేకపోతున్నాయి.

అమాంతం పెరిగిన ప్రభాస్, రాజమౌళి
బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా నటించిన ప్రభాస్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటి ఖండాలను దాటి అంతర్జాతీయ స్థాయి వరకు పెరిగింది. ఇక ఇంతటి కళాఖండాన్ని తెరకెక్కించిన రాజమౌళి.. ఇండియన్ సూపర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక అందరి దృష్టి వీరిద్దరి మీదే పడింది.

వీరి తదుపరి ప్రాజెక్ట్‌లపై అందరి దృష్టి..
బాహుబలి తరువాత వీరి రేంజ్ మారడంతో.. వీరు చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌లపై అందరి దృష్టి నెలకొంది. అందుకు ప్రభాస్ సాహో సినిమాను కూడా బాహుబలి రేంజ్‌లో రిలీజ్ చేశాడు. జక్కన్న తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ఆర్ఆర్ఆర్‌ను కూడా జాతీయ స్థాయిలోనే ప్లాన్ చేశాడు.
మళ్లీ అందరూ ఒక్క చోటకు..
బాహుబలి టీమ్.. మళ్లీ ఒక్క చోటుకు చేరుకున్నారు. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి, కీరవాణి అంతా లండన్ చెక్కేశారు. అక్కడి రాయల్ రాబర్ట్ హాల్‌లో ప్రదర్శించబోయే బాహుబలి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు వీరంతా హాజరయ్యారు. ఈ మేరకు రాజమౌళి, రానా, ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ పిక్‌ను షేర్ చేశారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











