బాబోయ్.. సాక్ష్యం సినిమాలో అంతుందా.. బాహుబలి టీమే రంగంలోకి దిగింది!
Recommended Video

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అతడు నటించిన అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక వంటి చిత్రాలు భారీ బడ్జెట్ తో నిర్మించినవే. బెల్లంకొండ శ్రీనివాస్ కష్టానికి గుర్తింపు లభిస్తున్నా సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న సాక్ష్యం చిత్రం ద్వారా ఆ లోటు తీరుతుందని ఈ యువహీరో ఆశలు పెట్టుకుని ఉన్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సాక్ష్యం చిత్రం వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

విడుదల వాయిదా
సాక్ష్యం జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వలన ఈ చిత్రాన్ని జులై కు వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కారణం అదేనా
ఈ చిత్రంలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. టీజర్ లో అద్భుతమైన విజువల్స్ చూపించారు. ఇదేదో సోషియో ఫాంటసీ తరహా చిత్రంగా అనిపిస్తోంది.

బాహుబలి టీం రంగంలోకి
భారీ స్థాయిలో ఉన్నా సీజీ వర్క్ కంప్లీట్ చేయడానికి బాహుబలి చిత్రానికి పనిచేసిన టీమ్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. వేగంగా సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ కంప్లీట్ చేసి జులైలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

యాక్షన్ సీన్స్ బలంగా
ఈ చిత్రంలో యాక్షన్ అంశాలు కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెల్లం కొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ నామా ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











