»   » నెం.1 రేటింగ్స్ సాధించిన బాహుబలి

నెం.1 రేటింగ్స్ సాధించిన బాహుబలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా వెండితెరపై సృష్టించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సౌతిండియా సినిమా ఊహకు కూడా అందని విధంగా ఈ చిత్రం వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ బాషల్లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది.

తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతోంది. అక్టోబర్ 4వ తేదీన ఈ చిత్రం మళయాలం వెర్షన్ మనోరమ టీవీలో ప్రసారం అయింది. మళయాలం ఇతర టీవీ ఛానల్స్ అన్నింటినీ అధిగమిస్తూ హయ్యెస్ట్ టీవీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. మనోరమ టీవీ ఛానల్ కు బాహుబలి సినిమా ప్రసారం వల్ల భారీగా లాభాలు వచ్చాయి.


BAHUBALI World TV Premiere on the TOP SPOT

అక్టోబర్ 25న బాహుబలి తెలుగు వెర్షన్ మాటీవీలో ప్రసారం కానుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఈ సినిమాకు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ రేటు కూడా భారీగా రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.


10 సెకన్ల యాడ్ కోసం పలు కంపెనీలు రూ. 2.5 లక్షలు చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. దీన్ని బట్టి బాహుబలి సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి రెండు పార్టులు కలిపి శాటిలైట్ రైట్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసారు. మరి ఇంత భారీ మొత్తం తిరిగా రావాలంటే యాడ్స్ రేట్లు ఈ మాత్రం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

English summary
Mazhavil Manorama, the Malayalam general entertainment channel from the publication giant Manorama Group, has clocked the highest TV ratings. During week 40 (BARC), the world television premiere of ‘Bahubali’ which was telecasted on 4th October 2015, has rated no.1 among all programmes in the Malayalam GEC space.
Please Wait while comments are loading...