డ్రగ్స్ బ్రదర్స్ కి దేవుడు వరమిచ్చినా..పూజారి వరమీలేదట...!
కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తో సహా రెండ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కిన డ్రగ్స్ బ్రదర్స్..అదేనండీ రవితేజ సోదరులు భరత్, రఘులకు బెయిల్ దొరికింది. ప్రస్తుతం వీరిరువురూ జైల్లో ఊచల్లెక్కడ్తోన్న సంగతి విదితమే. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక బెయిల్ కోసం ఓసారి ప్రయత్నించి విఫలమైన రవితేజ సోదరులకు ఎట్టకేలకు బెయిల్ లభించినా, బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతుల్ని కూడా విధించడంతో, నిబంధనలకు లోబడి వీరిద్దరూ బాహ్య ప్రపంచంలో తిరగాల్సి వుంటుంది.
అయితే దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్టు బెయిల్ దొరికినప్పటికీ ఈ బ్రదర్స్ బయటికి రాలేకపోయారు. ఇవాళ కృష్ణాష్ఠమి. గవర్నమెంట్ హాలీడే కాబట్టి ఈ రోజు రవితేజ సోదరులు బయటికి వచ్చే పరిస్థితి లేదు. దాంతో 'హే కష్ణా..." అని ఈ ఇద్దరూ జైల్లో గోడల మద్య కూర్చుని కష్ణడిని తలుచుకుంటారని చెప్పొచ్చు. బెయిల్ పేపర్స్ రేపు అందగానే జైలు నుంచి ఈ ఇద్దరూ బయటపడతారని సమాచారమ్.


Click it and Unblock the Notifications











