నిజంగానే ఎపిక్..స్పెల్ బౌండ్: టీజర్ అద్బుతం (వీడియో)
ముంబై: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'బాజీరావ్ మస్తానీ'. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణం తొలి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వాళ్లు ఒకటే మాట అంటున్నారు..అది అద్బతం అని...ఆ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'బాజీరావ్ తుపానులా రాబోతున్నాడ'ని రణ్‌వీర్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.
బాలీవుడ్‌లో ఈ సినిమా సంచలనాత్మక విజయం సాధించడం ఖాయమని రణ్‌వీర్ భరోసా ఇస్తున్నాడు. రణ్‌వీర్ ‘గెటప్' వివరాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన దర్శకుడు బన్సాలీ ఇపుడు హీరో, హీరోయిన్ల ‘ఫస్ట్ లుక్'ను విడుదల చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
మరాఠా యోధుడు బాజీరావ్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ‘'టీజర్ 'పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్ కొత్తగా కనిపిస్తున్నారు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. బాజీరావ్ భార్య కాశీబాయిగా తలపై కిరీటం, నవారీ చీర, సొగసైన ముక్కుపుడకతో ప్రియాంక చోప్రా ఆహార్యం ఆకట్టుకుంటోంది.
పీష్వా బాజీరావు పాత్రలో రణ్‌వీర్ సింగ్ కనపడటమే సినిమాకు నిండుతనం వచ్చిందంటున్నారు. బాజీరావ్ ప్రేయసి మస్తానీగా నటిస్తున్న దీపికా పదుకొణె చేతిలో విల్లుతో వీరనారిలా కనిపిస్తోంది.
షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్‌వాలే' విడుదలయ్యే రోజునే అంటే కిస్మస్ కానుకగా...(డిసెంబర్ 18) ‘బాజీరావ్ మస్తానీ' కూడా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లోను, థియేటర్లలోను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ‘కండల వీరుడు' సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్'తో పాటు ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులు వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications











