కృష్ణవంశి క్షమాపణ చెప్పాలి...
కృష్ణవంశి తాజాగా రూపొందించిన మహాత్మ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ వారు ధర్నా చేసారు. ఈ సంఘటన నిన్న(అక్టోబర్ 14)న మహాత్మ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. చిత్రంలో ఒక చోట భజరంగ్ దళ్ ని పోలిన వేష ధారణతో కొందరు వచ్చి హీరో, హీరోయిన్ బైక్ పై వెళ్తూంటే పట్టుకుని తాళి కట్టమని బలవంతం చేస్తారు. వారిని హీరో ఆపి ఫైట్ చేస్తాడు. ఇక ఈ విషయమై భజరంగ్ దళ్ వారు మాట్లాడుతూ “ఈ చిత్రం హిందువుల సెంటిమెంట్లను హర్ట్ చేసింది.ఆ సన్నివేశాలను వెంటనే చిత్రం నుండి తొలింగించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే కృష్ణవంశి, నిర్మాత ఇద్దరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నాం" అంటూ వారు హెచ్చరించి వెళ్లారు. ఇక ఈ సంఘటన పబ్లిసిటీకి ఉపయోగపడుతుందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
కృష్ణవంశి మహాత్మా శ్రీకాంత్ భావన భజరంగ్ దళ్ పరుచూరి బ్రదర్స్ హిందువులు మనోహర్ krishna vamsi mahatma srikanth bhavana apology paruchuri brothers bajrang dal dharna


Click it and Unblock the Notifications