అదిరిపోయిందంతే: సల్మాన్ 'భజరంగీ భాయిజాన్' టీజర్ (వీడియో)
హైదరాబాద్: అనుకున్న టైమ్ కు అదరకొట్టే రీతిలో సల్మాన్ తన తాజా చిత్రం టీజర్ ని దింపేసాడు. ఈ టీజర్ ఇప్పుడు అందరి మన్ననలూ పొందుతోంది. భజరంగి అనే వ్యక్తి...అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఇండియాలో తప్పిపోయిన ఓ పాకిస్ధాన్ పాపని...అక్కడికి తీసుకుని వెళ్లి ఎడ్రస్ పట్టుకుని అప్పచెప్పటమే కథాంశం అని టీజర్ తో స్పష్టమవుతోంది. ఈ టీజర్ లో వచ్చే డైలాగులు, విజువల్స్ చాలా బాగున్నాయి. మీరూ ఈ టీజర్ ని వీక్షించండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'భజరంగీ భాయిజాన్'. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్‌ను గురువారం దుబాయ్‌లో విడుదల చేశారు. ఇందుకోసం సల్మాన్ ముందుగానే దుబాయ్ చేరుకున్నారు. సల్మాన్‌ఖాన్ తన అధికారిక ట్విట్టర్‌లో టీజర్‌ను ఉంచారు. సల్మాన్ సరసన కరీనాకపూర్ ఖాన్ నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెండు రోజుల క్రితం...
సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా రూపొందుతున్న బాలీవుడ్ సినిమా 'భజరంగి భాయిజాన్' ఫస్ట్‌లుక్ విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు షారుక్ ఖాన్.

'హీరోగా ఉండడం కంటే సోదరుడిగా ఉండడమే చాలా గొప్ప విషయం అని నమ్ముతున్నా. 'భాయిజాన్' 2015 ఈద్‌కు విడుదలవుతుంది. ఫస్ట్ లుక్ నచ్చిందా?' అంటూ షారుక్ ఖాన్ ట్విట్టర్‌లో సల్మాన్ ఖాన్ ఫొటో పోస్ట్ చేశారు. ఈ లింక్‌ను సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
సల్మాన్‌పై సోదరప్రేమ చూపుతూ షారుక్ ట్విట్టర్‌లో ఫస్ట్‌లుక్ విడుదల చేయడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇటీవలే జమ్మూకశ్మీర్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యి సంచలనం రేపుతోంది.


Click it and Unblock the Notifications











