»   » గర్వంగా ఉంది: సల్మాన్ మూవీ ట్రైలర్‌పై రాజమౌళి

గర్వంగా ఉంది: సల్మాన్ మూవీ ట్రైలర్‌పై రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోగా తెరకెక్కిన ‘బజ్రంగి భాయిజాన్' మూవీ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో రాజమౌళి తన సోషల్ మీడియా ద్వార స్పందించారు. ఇది నేనే ఎంతో గర్వ పడాల్సిన విషయం. మా నాన్న విజయేంద్రప్రసాద్ సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్రింగి భాయిజాన్' సినిమాకు కథ రాసారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. టీంకు నా శుభాకాంక్షలు అని తెలిపారు.

A very proud moment for me, my father, Vijayendra Prasad garu has written the story for Salman Khan’s Bajrangi Bhaijaan which is touted to be a blockbuster hit. Wishing the team all the best for the film!

Posted by SS Rajamouli on Thursday, June 18, 2015

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంజాన్ కానుకగా జులై 17న సినిమా విడుదల కానుంది. తాజా ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది.

Bajrangi Bhaijaan Trailer: Rajamouli Says He Is Proud of his Dad

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్లో కరీనా కపూర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇందులో ఆమె రాశిక పాత్రలో నటిస్తోంది. మరో పాత్రధారి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో పాకిస్థాన్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి.

English summary
Now that the trailer of Bajrangi Bhaijaan starring Salman Khan and Kareena Kapoor is out, Tollywood celebs started going gaga over it already. But do you know the film's connection with Tollywood? Well! Let us help you out. The story of this much awaited flick of Salman Khan was provided by Rajamouli's father, famous story writer Vijayendra Prasad.
Please Wait while comments are loading...