twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన వల్లే ఆ రోజు నా ప్రాణాలు దక్కాయి: మెగాస్టార్ అమితాబ్

    By Bojja Kumar
    |

    మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ నాయకుడు బాల్ థాకరే. 'శివసేన' పార్టీ అధినేతగా ఆయన ఎన్నో సంచలనాలకు కారణం అయ్యారు. త్వరలో బాల్ థాకరే జీవితంగా ఆధారంగా సినిమా రాబోతోంది. 'థాకరే' పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. బాల్ థాకరే పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు.

    ఆయన వల్లే నా ప్రాణాలు దక్కాయి

    ఆయన వల్లే నా ప్రాణాలు దక్కాయి

    సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమితాబ్ బచ్చన్... బాల్ థాకరే గురించి గుర్తు చేసుకున్నారు. కూలీ' సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తన ప్రాణాలు దక్కడానికి ప్రధాన కారణం బాల్ థాకరే అని తెలిపారు.

     శివసేన అంబులెన్సే దిక్కయింది

    శివసేన అంబులెన్సే దిక్కయింది

    కూలీ సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ అయినపుడు బాగా వర్షం పడుతోంది. సమయానికి అంబులెన్స్ కూడా లభించలేదు. అపుడు బాల్ థాకరే శివ సేన అంబెలెన్స్ పంపారని, అందులోనే తాను ఆసుపత్రికి వెళ్లానని అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.

     ఆయన్ను అలా చూసి తట్టుకోలేక పోయాను

    ఆయన్ను అలా చూసి తట్టుకోలేక పోయాను

    తమ ఫ్యామిలీ బోపోర్స్ కుంభ కోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో కూడా థాకరే మాకు మద్దతుగా ఉన్నారు. ఎలాంటి తప్పూ చేయనపుడు భయపడాల్సిన అవసరం లేదని ఎంతో దైర్యాన్ని ఇచ్చారని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. ఆయన చనిపోవడానికి ముందు, ఆయనకు చికిత్స జరుగుతున్న గదిలోకి వెళ్లానని, అలాంటి స్థితిలో ఆయనను చూసి తట్టుకోలేక పోయానని అమితాబ్ చెప్పారు.

    బాల్ థాకరే బయోపిక్

    బాల్ థాకరే బయోపిక్

    ‘బాల్ థాకరే' బయోపిక్‌లో ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించబోతున్నారు. బాల్యంతో పాటు కార్టూనిస్టు ఉన్న ఆయన ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్‌గా టర్న్ అవ్వడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు చూపించబోతున్నారు.

    ‘థాకరే’ టీజర్ అదుర్స్

    బాల్ థాకరే పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అభిజిత్ పన్సే దర్శకత్వం వహిస్తున్నారు. బాల్ థాకరే జయంతి సందర్బంగా జనవరి 23, 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Bollywood megastar Amitabh Bachchan, Shiv Sena President Uddhav Thackeray and Shiv Sena MP Sanjay Raut announced a biopic on Bal Thackeray.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X