అందమైన ప్రేమకథగా మంచు కురిసే వేళలో..
రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం "మంచు కురిసె వేళలో". ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలొ పనిచేసిన బాలా తొలిసారి దర్శక, నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాలా మాట్లాడుతూ.. "మంచు కురిసె వేళలొ" టైటిల్ తగ్గట్టుగానే ప్యూర్ లవ్ ఎంటర్ టైనర్. వైజాగ్, కూర్గ్, ఊటీ, అరకు, హైదరాబాద్ ప్రాంతాలలోని అందమైన లొకేషన్లలొ చిత్రీకరణ జరిపాం. నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి అని తెలిపారు.

మంచు కురిసె వేళలో చిత్ర కథ, కథనాలతోపాటు టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంటుంది. మళ్లీ రావా చిత్ర ఫేం శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయి అని బాలా తెలిపారు.
మంచు కురిసే వేళలో సినిమా ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేస్తాం. డిసెంబర్‌లొ సినిమాను రిలీజ్ చెస్తాం అని బాలా పేర్కొన్నారు.
సాంకేతికవర్గం
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణం: ప్రణతి ప్రొడక్షన్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: బాలా బోడెపూడి


Click it and Unblock the Notifications











