రిలీజ్‌కి సిద్ధంగా బాల
ప్రవాసాంధ్రుడు బాల కథానాయకునిగా గోవింద వరాహ దర్శకత్వంలో పి.వి.రమేశ్‌రాజు నిర్మించిన చిత్రం - బాల మొత్తానికి విడుదలకు రెడీ అయింది. ఈ చిత్రం పూర్తయి చాలాకాలమే అయినా బయ్యర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొందని టాలీవుడ్ సమాచారం. స్మైల్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విలీషా-సందీప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఆడియో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులనీ అలరిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.
తాము ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా రూపొందించామని బాల చిత్ర కథకుడు, దర్శకుడు అయిన గోవింద్ వరాహ చెప్పారు. ఆడియో ఎంతటి విజయం సాధించిందో, సినిమా కూడా అంతగా అలరిస్తుందని గోవింద్ వరాహ చెప్పారు. కథతో పాటు మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా గోవింద్ వరాహ అందించారు.


Click it and Unblock the Notifications