నందమూరి మల్టీస్టారర్.. మేము ముగ్గురం కలిసి నటించడానికి రెడీ.. బాలయ్య కామెంట్స్ వైరల్
నందమూరి అభిమానులకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అది నెరవేరుతుందని ఇప్పటికీ కోటి ఆశలతో ఉన్నారు. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూశారు. కనీసం ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా కలిసి నటిస్తే బాగుండని ఆశపడుతుంటారు. అయితే ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది. గతంలో కొరటాల శివ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

కొరటాల ప్రయత్నం..
జనతా గ్యారెజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్రను మొదటగా బాలయ్య కోసం డిజైన్ చేశారట. అయితే తీరా అక్కడి నుంచి విముఖత వ్యక్తం కావడంతో మోహన్ లాల్ లైన్‌లోకి వచ్చారు. మోహన్ లాల్, ఎన్టీఆర్ కాంబో అదిరిపోయి బాక్సాఫీస్ బద్దలైంది.

మల్టీ స్టారర్‌పై ఆశలు..
బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించాలని ఫ్యాన్స్ మాత్రం కోరుతూనే ఉంటారు. వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చెప్పలేం. కానీ ఆ హీరోలు మాత్రం ఎప్పటికప్పుడు మల్టీ స్టారర్‌పై ఆశలు రేపుతూనే ఉంటున్నారు. తాజాగా బాలయ్య బాబు స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ఎటువంటి అభ్యంతరం లేదు..
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాను కలిసి నటించడంపై మాట్లాడుతూ.. మంచి సబ్జెక్ట్ వస్తే తప్పకుండా నటిస్తామని అన్నాడు. డబ్బు చేసుకోవడానికో, వ్యాపారం కోసమో అయితే తాను చేయనని తెలిపాడు. అందరం కలిసి చేస్తున్నామంటే ఓ స్థాయి ఉంటుంది కదా! అందుకు తగ్గట్టు ఆ సినిమా కథ బ్రహ్మాండంగా ఉండాలన్నాడు. మల్టీ స్టారర్ విషయంలో తనకెలాంటి అభ్యంతరం లేదని, తప్పకుండా చేస్తానని తెలిపాడు.
Recommended Video

షూటింగ్‌ల పరిస్థితి..
కరోనా నేపథ్యంలో షూటింగ్‌లు పున: ప్రారంభించడంపై మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని అన్నాడు. అది కొంచెం రిస్కేనని.. అందుకని, తొందర పడాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఎంతోమంది రోజు గడవని కార్మికులున్నారున్నారని, వాళ్లూ బతికి ఉండాలి కదా! అయితే లేని పోని కరోనా తెచ్చుకుని కష్టాలు పడడం ఎందుకు? షూటింగులు మొదలు కావడానికి మూడు నాలుగు నెలలు పడుతుందని తర నమ్మకమని అన్నాడు.


Click it and Unblock the Notifications











