»   » మొరాకోలో బాలయ్య యుద్దం మొదలైంది

మొరాకోలో బాలయ్య యుద్దం మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న మొరాకోలో ప్రారంభమైంది.

"మొరాకోలో మూడు వారాల పాటు చిత్రీకరణ జరుపుతాం. హాలీవుడ్ టెక్నిషియన్స్ సహకారంతో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా మొదటి రోజు పూర్తయ్యింది. బాలకృష్ణగారు, కబీర్ బేడిగారు తదితరులు ఈ షెడ్యూల్ లో ఉత్సాహంతో పాలు పంచుకున్నారు. తొలిరోజు సన్నివేశాలు అనుకున్న దానికంటే బాగా రావడంతో చాలా హ్యపీగా ఉన్నాం" అంటూ అక్కడి వివరాలని పంచుకున్నారు.

Bala Krishna's Gautamiputra Satakarni Team at Morocco Exclusive

ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రంగా "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే సినిమా ఎలా ఉంటుందోనని సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే సినిమా కోసం, పాత్ర కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే బాలకృష్ణను ఈ సినిమా కోసం లుక్ నుండి ప్రతి విషయంలో కేర్ తీసుకుని సన్నద్ధం చేస్తున్నారు దర్శకులు క్రిష్.

మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న ప్రారంభం కానుంది. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్ ను, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ తో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అల్రెడి మ్యూజిక్ స్టార్ట్ చేసేశారు. అన్నీ విధాలుగా అందరినీ అలరించే చిత్రాన్ని రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు.

Bala Krishna's Gautamiputra Satakarni Team at Morocco Exclusive

బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్,సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి,జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

English summary
Balakrishna's 100th movie Gautamiputra Satakarni to shoot in Morocco
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu