twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలి గోటికి సరిరాదు.. చెప్పుతో సమానం.. బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు

    |

    టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369 మూవీ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా పలు మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ.. ఆ సినిమా గురించిన విశేషాలు వెల్లడించారు. ఆదిత్య 369 సినిమాలోని హైలెట్స్ గురించి మాట్లాడుతూ బాలయ్య ఓ సందర్భంలో ఆవేశానికి లోనయ్యారు. బాలయ్య ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే...

    మేమే ట్రెండ్ సెట్టర్స్

    మేమే ట్రెండ్ సెట్టర్స్

    కొత్తరకమైన కథలతో సినిమాలు తీసే విషయంలో మేమే ట్రెండ్ సెటర్స్. ఫ్యాక్షనిజం కానీ, పౌరాణికం గానీ, చారిత్రక చిత్రాలు కానీ మేమే చేశాం. ఆదిత్య 369 ఓ విభిన్నమైన సినిమా. అలాంటి సినిమాలు చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఆ సాహసం చేసింది నేనే. ఏదైనా హిస్టరీ తిరగరాయాలంటే అది మాకే సాధ్యం అంటూ బాలకృష్ణ తెలిపారు.

    ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు

    ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు

    ఆదిత్య 369 సినిమాకు సినిమాటోగ్రఫి ప్రాణం. తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు పనిచేయని విధంగా ఈ సినిమాకు ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పనిచేశారు. వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్, పీసీ శ్రీరాం పనిచేశారు. వీఎస్ఆర్ స్వామి షూట్ చేస్తే ఎక్స్‌ట్రా సీన్ ఉండేవి కావు. సినిమాటోగ్రఫి పరంగా సాంకేతికంగా అద్బుతమైన వర్క్‌ను చేశారు అని బాలకృష్ణ తెలిపారు.

    ఇళయ రాజా అద్భుతంగా మ్యూజిక్

    ఇళయ రాజా అద్భుతంగా మ్యూజిక్

    ఆదిత్య 369 సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఆ సినిమాకు ఆయన మ్యూజిక్ ఇచ్చారనే విషయాన్ని నమ్మలేం. మ్యూజిక్ విషయంలో ఆయనది ప్రత్యేకమైన పంథా. ఇళయరాజా వల్లే ఆ సినిమాలో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. జిక్కి గారు పాడిన జానవులే పాట అందర్ని ఆకట్టుకొన్నది అని బాలకృష్ణ అన్నారు.

     ఏఆర్ రెహ్మాన్ ఎవరో తెలియదు అంటూ

    ఏఆర్ రెహ్మాన్ ఎవరో తెలియదు అంటూ

    ఇళయరాజా మ్యూజిక్ విషయంలో నేను ప్రేక్షకుడిగా చెబుతాను. నేను ఓ రివ్యూ చేసి చెబుతాను. ఆదిత్య 369 సినిమాకు మ్యూజిక్ ఆయన ఇచ్చారంటే ఎవరు నమ్మరు. రెహ్మాన్‌దో ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన ఎవరో నాకు తెలియదు. పదేళ్లకు ఓ హిట్ ఇస్తారు. ఆస్కార్ అవార్డు అందుకొంటారు. అవార్డులు అందుకొన్నంత మాత్రాన గొప్పవాళ్లు కాదనే విధంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    Recommended Video

    Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
    ఎన్టీఆర్ కాలి గోటికి సరిరాదు...

    ఎన్టీఆర్ కాలి గోటికి సరిరాదు...

    తన తండ్రి స్వర్గీయ రామారావుకు ఏం అవార్డులు వచ్చాయని ఆయన మహనీయుడు అయ్యారు. భారతరత్న ఇవ్వకపోవడం వల్ల ఆయన కీర్తికి ఎలాంటి భంగం వాటిల్లదు. రామారావు గారికి భారతరత్న కాలి గోటికి సమానం. ఆ అవార్డు చెప్పుతో సమానం. ఆ అవార్డు ఇచ్చినందుకు రామారావుకు గౌరవం కాదు. ఆయనకు ఇచ్చిన వాళ్లకు ఆ గౌరవం దక్కుతుంది అని నందమూరి బాలకృష్ణ ఆవేశంగా అన్నారు.

    English summary
    Bala krishna's Aditya 369 movie completed 30 years recenlty. In this occassion, He recollected his memories with the movie. He made sensational comments about Bharata Ratna to NTR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X