బాలయ్య ‘అధినాయకుడు’ మళ్లీ వాయిదా
బాలకృష్ణ హీరోగా వస్తున్న 'అధినాయకుడు' సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను మార్చి 23న విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు. వాస్తవానికి అధినాయకుడు సినిమా సంక్రాంతికి విడుదలవ్వాల్సి ఉంది. పలు కారణాలతో ఈ సినిమా ఫిబ్రవరి నెలకు వాయిదా పడింది. తాజాగా బాలయ్య సినిమాను మరో నెల రోజుల పాటు వెనక్కి తోసేసారు నిర్మాతలు.
బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముసలాయన పాత్రలో, తండ్రి పాత్రలో , కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా లక్ష్మిరాయ్, సలోనిలు నటిస్తున్నా. పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తీ కంబైన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫిబ్రవరి నెలలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ప్రస్తుత రాజకీయాలను ఎండగడుతూ ఈ చిత్రం ఉంటుందని చర్చించుకుంటున్నారు. త్వరలో రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్న బాలయ్యకు ఈ సినిమా ప్లస్ అవుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











