కామిడీ బ్రదర్స్ (బాలా వాడు-వీడు ప్రివ్యూ)

By Srikanya

గతంలో శివ పుత్రుడు, శేషు, నేనే దేముడ్ని వంటి విబిన్న చిత్రాలు అందించిన దర్శకుడు బాలా తాజా చిత్రం వాడు వీడు. యంగ్ హీరోలు విశాల్, ఆర్య కాంబినేషన్ లో రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రంలో కథ ప్రకారం...వాల్టర్‌ (విశాల్‌), దండాల స్వామి (ఆర్య)...మతాలు వేరైనా ఇద్దరూ ఓ రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములే. ప్రతి చిన్న విషయానికీ గొడవపడుతుంటారు. దొంగతనం చేయటం వీరి ప్రధాన వృత్తి. వాల్టర్‌ ఓ మంచి కళాకారుడు కూడా. వీళ్లిద్దరికీ హైనస్‌ (జి.ఎమ్‌.కుమార్‌) అనే జమీందార్‌తో ఉన్న సంబంధమేమిటి? ఈ అన్నదమ్ముల్లో ఉన్న కళ వారిని ఏ స్థాయికి తీసుకెళ్లింది? బేబి (జనని), నాగు (మధుశాలిని) అనే యువతులతో వీళ్లకున్న సంబంధమేమిటనే విషయాల్ని తెరపైనే చూడాలి.

ఇక ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరో విశాల్‌ మాట్లాడుతూ...స్క్రీన్‌ప్లే ఆధారంగా సాగే చిత్రమిది. ప్రతి సన్నివేశంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. సినిమా మొత్తం మెల్ల కన్ను పెట్టుకొని నటించాను. కొంత భాగం యువతిగా కనిపిస్తాను. సూర్య అతిథిపాత్రలో కనిపించే సన్నివేశాలు రక్తికట్టిస్తాయన్నారు.

సంస్థ: జి.కె.ఫిల్మ్‌ కార్పొరేషన్‌
నటీనటులు: విశాల్‌, ఆర్య, మధుశాలిని, జనని, జి.ఎమ్‌.కుమార్‌, సూర్య(అతిథిపాత్రలో), విఘ్నేష్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
నిర్మాత: విక్రమ్‌కృష్ణ
దర్శకత్వం: బాల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X